is Virat Kohli better than Sachin Tendulkar in terms of chasing..?

Is virat kohli a better cricketer than sachin tendulkar

Virat Kohli,Sachin Tendulkar,ICC World T20,Shikhar Dhawan,Suresh Raina,Mahendra Singh Dhoni, India vs Australia,ICC World Twenty20,Kohli Tendulkar,Shane Warne Kohli,Johnson Kohli,ICC World Twenty20,World T20,India World T20, Is Virat Kohli a better cricketer than Sachin Tendulkar?

With his amazing record as a finisher, especially in crunch situations, Virat Kohli is a match-winner like none other

ఇరువురిలో ఎవరు గోప్ప..? సచిన్..? విరాట్..?

Posted: 04/07/2016 07:14 PM IST
Is virat kohli a better cricketer than sachin tendulkar

విరాట్ కోహ్లీ జోరు మీదున్నాడు. ‘నీ దూకుడు.... సాటెవ్వడూ?’ అన్నట్లు వీర విహారం చేస్తున్నాడు. అతడి వేగాన్ని చూస్తున్నవాళ్ళంతా ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్‌తో అతన్ని పోల్చి చూస్తున్నారు. ఇలా వీరిద్దరి మధ్య సారూప్యతను గుర్తు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. విరాట్ స్వరూపాన్ని ప్రదర్శిస్తూ మంచి ఊపుమీదున్న కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో ఎలాంటి రికార్డులనైనా అవలీలగా బద్దలుగొట్టేస్తాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఢిల్లీ డ్యాషింగ్ హీరో విరాట్ కోహ్లీకి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మధ్య పోలికలు చూస్తే... ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ గణాంకాలతో సోషల్ మీడియాలో వాడివేడి చర్చలకు తెరలేపుతున్నారు వారి అభిమానులు.

సచిన్ 27 సంవత్సరాల 144 రోజుల వయసులో 249 మ్యాచుల్లో 42.10 సగటుతో 9,262 పరుగులు సాధించాడు. వీటిలో 25 శతకాలున్నాయి. విరాట్ కోహ్లీ అదే వయసులో పరుగుల విషయంలో సచిన్ కన్నా వెనుకబడి ఉన్నాడు కానీ, సగటు చూస్తే ఎక్కువగా ఉంది. 171 మ్యాచుల్లో 51.51 సగటుతో 7,212 పరుగులు సాధించాడు. 25 శతకాలు నమోదు చేశాడు. వీళ్ళిద్దరి ఆట తీరును పరిశీలించినపుడు విరాట్ కోహ్లీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పక తప్పదు. సచిన్ టెండూల్కర్ 171 మ్యాచుల్లో 5,828 పరుగులు సాధించాడు. అప్పటికి పరుగుల సగటు 38.85 కాగా 12 శతకాలు నమోదు చేశాడు.
 
శతకాలు సాధించడంలో కూడా కోహ్లీ ముందంజలో ఉన్నాడు. 162వ ఇన్నింగ్స్‌ నాటికే 25వ శతకాన్ని నమోదు చేశాడు. అదే ఫీట్‌ను సచిన్ టెండూల్కర్ 234వ ఇన్నింగ్స్‌లో సాధించాడు. 20వ శతకాన్ని కోహ్లీ 106వ ఇన్నింగ్స్‌లో చేజిక్కించుకోగా, టెండూల్కర్ 197వ ఇన్నింగ్స్‌ వరకు ఆగాడు. 15వ సెంచరీ ఢిల్లీ బ్యాట్స్‌మన్ ఖాతాలో 106వ ఇన్నింగ్స్‌లోనే పడింది. క్రికెట్ గాడ్ 182వ ఇన్నింగ్స్‌లో 15వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సచిన్ కంటే తాను ఎప్పటికీ ఎక్కువ కాదని కోహ్లీయే స్వయంగా చెప్పాడు. మరి క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికైనా ఈ చర్చకు తెర వేస్తారో, లేదో చూడాలి!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hot discussion  ccomparision  Virat kohli  Sachin Tendulkar  India  cricket  

Other Articles