ICC World T20: Virat Kohli's innings sets Twitter on fire

Celebrities and fans lauds virar kohli super performence against australia

Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, Mahendra Singh Dhoni, Shane Watson, Amitabh bachan, Aamir khan, sachin tendulkar, brain lara, salute, Icc world cup T20- 2016,indvsaus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

A look at how the Twitterati reacted to the vice-captain's knock which helped India beat Australia

విరాట్ కోహ్లీ అద్భుత ఆటతీరుపై ప్రశంసల వెల్లువ..

Posted: 03/28/2016 04:59 PM IST
Celebrities and fans lauds virar kohli super performence against australia

టీమిండియా డేరింగ్, డాషింగ్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ.. తన అద్భుతమైన బ్యాటింగ్తో పొట్టి ప్రపంచ కప్లో భారత్ను ఒంటి చేత్తో సెమీస్కు తీసుకెళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు వెల్లివిరుస్తూనే ఉంది. కోహ్లీ ఆట తీరుపట్ల బాలీవుడ్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, అమిర్ ఖాన్ ముగ్దులైపోయారు. కోహ్లీ నిజంగా ఓ జీనియస్ అని అమితాబ్ తమకు ఇలాంటి ఆనందకరమైన రాత్రులను మరిన్ని ఇవ్వాలని కోరారు. ఇక అమిర్ ఖాన్ అయితే.. ఒకేసారి తనకు మారథాన్, చెస్, ఆర్చరీ చూసినట్లనిపించిందని, కోహ్లీకి నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఆరు వికెట్లతో ఆస్ట్రేలియాను భారత్ మట్టి కరిపించి సెమీస్ కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఇందులో అత్యంత కీలక పాత్రను కోహ్లీ పోషించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచ స్థాయి ప్రశంసలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బాలీవుడ్ సూపర్ హీరోలు స్పందించారు. 'వాట్ ఏ ఇన్నింగ్స్.. విరాట్ నీకు నా వందనం. మారథాన్, చదరంగం, ఆర్చరీల కలయికను ఒకేసారి చూసినట్లుంది' అంటూ ట్వీట్ చేశారు. విరాట్ నీవు చాలా జీనియస్.. సమయానికి తగినట్లు వ్యవహరించడంలో నిజంగా నీవి అద్భుతమైన తెలివితేటలు. ఈ రాత్రిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి రాత్రులు మనకు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను' అని అమితాబ్ ట్వీట్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh bachan  Aamir khan  virat kohli  salute  Icc world cup T20-2016  

Other Articles