England vs South Africa, World T20: Joe Root breaks ground, England flower

Eden gardens turns into a fortress ahead of india vs pakistan clash

india vs pakistan, ind vs pak, pak vs ind, pakistan vs india, india, pakistan, ms dhoni, shahid afridi, afridi, world cup 2016, world t20, wt20, india pakistan kolkata, ind pak kolkata, eden gardens, kolkata, cricket news, cricket updates, cricket

Eden Gardens will turn into a fortress with multiple security rings for the high-octane India-Pakistan World Twenty20 clash as there are no favourites for India-Pakistan contest.

ఈడెన్ లో దాయాధుల సమరం.. గెలుపెవరిదీ..?

Posted: 03/19/2016 10:48 AM IST
Eden gardens turns into a fortress ahead of india vs pakistan clash

అద్భుతాలు చోటుచేసుకుని ఏ జట్టు ఎప్పుడు ఎలా గెలుస్తుందో కూడా అంచనా వేయలేని ఫార్మెట్ టీ 20. ఇక తాజాగా జరుగుతున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్లో మెగా ఈవెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేది ధాయాధులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్. టీ 20లలో భారత్ పై ఇప్పటి వరకు టీ 20 ఫార్మెట్ లో గెలుపనేది ఎరుగని పాకిస్థాన్ జట్టు, తాజాగా జరుగుతున్న టోర్నమెంటులో బంగ్లాదేశ్ పై గెలిచి ఉత్సాహంతో వుంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చరిత్రను తిరగరాస్తామని, రాయాలని ఉవ్విళ్లూరుతుంది. తమకు ఈడెన్ గార్డెన్స్ అచ్చోచ్చిన మైదానమని, ఇక్కడ చరిత్రను తిరగరాస్తామని పాకిస్తాన్ అంటోంది.

వరుస విజయాలకు తోడు అసియా కప్ టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా.. టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్వల్ప స్కోరు చేధనలో ఓటమి చవిచూసింది. దీంతో అప్పటి వరకు హాట్ ఫేవరేట్ గా వున్న జట్టు కాస్తా.. తీవ్ర ఒత్తడికి గురవుతుంది. టీ 20 టైటిల్ సాధించి స్వదేశంలో జరిగిన టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్రను లిఖించాలని భావించిన ధోనిసేన.. ఇకపై లీగ్ దశలో అన్ని మ్యాచ్ లను గెలవాల్సిన పరిస్థితి రావడంతో ఒత్తిడిక గురవుతుంది.

ఒక మ్యాచ్ లో స్వల్ప స్కోరును సాధించలేని జట్లు కూడా మరో మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించడంలో విజయం సాధిస్తుంటాయని... అదే ఫోట్టి ఫార్మెట్ గ్రేట్ నెస్. టీ 20 మ్యాచ్ లలో ఎవరూ ఫేవరెట్లు కాదని.. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులే వారిని మ్యాచ్ విన్నర్లుగా మారుస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నవాదనలు ఏకీభవించిన దాయాధి క్రికెటర్లు గెలుపు కోసం మాత్రం శ్రమించాల్సి వుంటుంది. ఈడెన్ లోని మెగా ఈవెంట్ లో ఎవరు గెలుస్తారు.. విజయం ఎవరిని వరిస్తుందన్నది మాత్రం సాయంత్రం వరకు వేచి చేడాల్సిందే. అయితే దాయాధులిద్దరూ వైరి వర్గంలా కాకుండా.. స్పోర్టివ్ స్పిరిట్ తో మాత్రమే ఈ మ్యాచ్ అఢాలని భావిస్తున్నారు.

స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో తాము విజయం సాధిస్తామని చెప్పుకుంటూ వచ్చిన టీమిండియాను.. చరిత్రను తిరగరాస్తామని చెబుతూ బరిలో దిగుతున్న పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు కోసం దేశ, విధేశాల నుంచి ఇప్పటికే పలువురు అభిమానులు కోల్ కతాకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఈడెన్ లో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవ్వనున్నారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా పోలీసులు, సాయుధ దళాలు ఈ మ్యాచ్ కు గట్టి పహారాను, భందోభస్తును ఏర్పాటు చేస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eden gardens  india pakistan  india vs pakistan  ms dhoni  shahid afridi  t20 world cup 2016  

Other Articles