Chris Gayle Destroyed England's Plans Singlehandedly, Says Eoin Morgan

Eoin morgan confident in england despite opening world twenty20 loss

icc world t20, wt20, wt20 india, wt20 England, england, eoin morgan, morgan england, england morgan, england cricket, Eoin Morgan, Chris Gayle, World T20 2016, Cricket news, T20 World cup, waqar, cricket

Chris Gayle batted with such supremacy that the honest efforts of England bowlers did not bear fruit, according to captain Eoin Morgan

క్రిస్ గేల్ విధ్వంసం ముందు చేష్టలుడిగాం..

Posted: 03/17/2016 09:07 PM IST
Eoin morgan confident in england despite opening world twenty20 loss

వెస్టిండీస్ విధ్వంసకర స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అరేబియా సముద్రపు తీరాన జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదే విషయమై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గేల్ ఆటతీరును ప్రశంసిస్తూనే.. అతను ఏం చేయగలడో అదే చేశాడని అయితే తమ ఆటగాళ్లు మాత్రం చేష్టలుడికి చూశారని అన్నాడు. తొలి మ్యాచ్ లో విండీస్ పై ఓటమిపై మోర్గాన్ మాట్లాడుతూ, గేల్ ను కట్టడి చేసేందుకు షార్ట్ పిచ్ బంతులు వేయాలని వ్యూహం రచించుకున్నామని అన్నాడు. వాటిని గేల్ అద్భుతంగా ఎదుర్కొన్నాడని తెలిపాడు.

పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలిగామని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఆదిల్ రషీద్ బౌలింగ్ లో గేల్ రెచ్చిపోయాడని చెప్పాడు. తమ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా గేల్ విరుచుకుపడ్డాడని ఆయన పేర్కొన్నాడు. అలాంటి బ్యాట్స్ మన్ కు బంతులేయడం కష్టమని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇలాంటి బ్యాట్స్ మెన్లకు ఎలా బౌలింగ్ చేయాలన్న అంశంపై మ్యాచ్ తరువాత చర్చించుకున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లో 11 సిక్సర్లు, ఐదు ఫోర్లతో సెంచరీ చేసిన గేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eoin Morgan  England  eng vs wi  Chris Gayle  World T20 2016  Cricket  

Other Articles