Brave Bangladesh beaten by 8 wickets as India lift Asia Cup

Asia cup trophy special for dhoni

India vs Bangladesh, asia cup final 2016, Ind vs Ban, Asia Cup, Cricket Score, cricket, Mahendra Singh Dhoni, asia cupn 2016, Dhoni, india, bangladesh, twenty 20, rohit sharma, shikhar dhawan, virat kohli, Yuvraj Singh, tamim iqbal, mortuza, cricket news

As India lifted the Asia Cup trophy without losing a single match in the tournament, skipper MS Dhoni said they were well on track for the World Twenty20, beginning in two days time.

అరవసారి అసియాకప్ అందుకున్న టీమిండియా..

Posted: 03/07/2016 12:49 PM IST
Asia cup trophy special for dhoni

ఆసియాకప్ లో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచిన టీమిండియా ఫైనల్ లోనూ అదే జోరును కనబర్చింది. సొంతగడ్డపై, అభిమానుల అండతో సంచలనం సృష్టించాలనుకున్న బంగ్లాదేశ్ ఆశలు నెరవేరలేదు. శిఖర్ ధావన్ (44 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు)ల సమయోచిత బ్యాటింగ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 15 ఓవర్లకు కుదించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. మహ్మదుల్లా, షబ్బీర్ రెహమాన్ చెలరేగి ఆడారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. ధోని (6 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఐదు వికెట్లు 75 పరుగుల వద్ద నున్న బంగ్లాదేశ్ స్కోరుబోర్డును వీరిద్దరూ కలసి పరుగులు పెట్టిందారు. షబ్బీర్‌ (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు)కు జత కలిసిన మహ్మదుల్లా  (13 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయి చివరి మూడు ఓవర్లలో 42 పరుగులు రాబట్టాడు. అశ్విన్, నెహ్రా, బుమ్రా, జడేజా తలా ఓ వికెట్ తీశారు.

ఆ తరువాత బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ శర్మ విక్కెట్ ను కోల్పయిన తరువాత, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు జాగ్రత్తగా అడుతూ స్కోరుబోర్టును ముందుకు నడిపించారు. ఐదు, ఆరు ఓవర్లలో ఆరు ఫోర్లతో 29 పరుగులు చేసి జోరు పెంచారు. తర్వాత స్పిన్నర్ నాసిర్ హుస్సేన్ కట్టడి చేసినా... మోర్తజా ఓవర్‌లో ధావన్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదడంతో పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 71/1కి చేరింది. ఈ క్రమంలో ధావన్ 11వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.

ఇదే ధశలో శిఖర్ ధావన్ బలంగా కోట్టిన షాట్ ను క్యాచ్ పట్టడంతో ఆయన వెనుదిరిగాడు. ఇక 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో ధోని మెరుపులు మెరిపించాడు. అమిన్ వేసి న 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. 12వ ఓవర్‌లో కోహ్లి... మూడు బౌండరీలతో నాసిర్‌కు చుక్కలు చూపెట్టాడు.  ధోని, కోహ్లి మూడో వికెట్‌కు 7 బంతుల్లో అజేయంగా 23 పరుగులు జత చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cupn 2016  india  bangladesh  Mahendra Singh Dhoni  twenty 20  

Other Articles