'Painful watching Pakistan play like this' says pcb chief Shaharyar khan

Pakistan threaten to pull out of world t20

India,Pakistan,Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala,World T20, 2016,Cricket latest World T20, world t20 2016, bcci, pcb, pakistan, dharmashala, Icc, Shaharyar khan, pakistan cricket board

The Pakistan Cricket Board (PCB) is worried that security in Dharamsala, where the ICC World Twenty20 match is scheduled against arch-rivals India on March 19, has run into problems. Besides the state government, even Himachal's war veterans are opposing the match.

మా క్రికెటర్ల భద్రతపై బహిరంగ ప్రకటన చేయాలి..

Posted: 03/04/2016 04:06 PM IST
Pakistan threaten to pull out of world t20

తమ జట్టుకు పూర్తి భద్రత కల్పించడంలో భారత్ విఫలమవుతుందని భావించే పక్షంలో ఇండియాలో జరగనున్న వరల్డ్ టీ-20 పోటీలను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ హెచ్చరించారు. ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్‌ ఆడనుందని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, లేదంటే తాము మెగాటోర్నీ నుంచి తప్పుకొంటామని తెగేసి చెప్పింది.

ఈ నెల 19న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పాక్ తో భారత్ ఆడాల్సి వుండగా, ఆ మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచును హిమాచల్ ప్రదేశ్‌ మాజీ జవాన్లు వ్యతిరేకిస్తుండటంతో వేదిక మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీసీబీ మరో మెలిక పెట్టింది. టీ-20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పాల్గొంటున్న విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాలని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌ డిమాండ్ చేశారు.

"మా అనుమానాలను ఇప్పటికే ఐసీసీ ముందుంచాం. భారత ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన కోరుతున్నాం. మా జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. అటువంటి ప్రకటన ఇంతవరకూ రాలేదు. మేము భారత్ కు వెళ్లేందుకు మా దేశం అనుమతించింది. కానీ, బీసీసీఐ, మోదీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సమాచారమూ లేదు. ఇదంతా ఆ దేశ అంతర్గత రాజకీయం. పరిస్థితి ఇలాగే ఉంటే టోర్నీని బహిష్కరిస్తాం" అని ఆయన అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup 2016  cricket  india  bcci  pcb  pakistan  dharmashala  Icc  Shaharyar khan  

Other Articles