Indian Women's cricket team delivers clean sweep in Sri Lanka T20Is

India women thrash sri lanka to complete series whitewash

Ekta Bisht, Anuja Patil, Eshani Lokusuriyage, Ama Kanchana, Vellaswamy Vanitha, Smriti Mandhana, Veda Krishnamurthy, Mithali Raj, Mithali Raj india, india Mithali Raj, Mithali india, india Mithali, india womens cricket team, india womens cricket, bcci, India, srilanka, cricket news, cricket, sports

After making Sri Lanka suffer a whitewash in the ODI series, the Indian Women's cricket team registered a clean sweep in the T20Is too.

శ్రీలంకను క్లీన్ స్వీవ్ చేసిన టీమిండియా..

Posted: 02/26/2016 08:04 PM IST
India women thrash sri lanka to complete series whitewash

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు అదే దూకుడుతో దూసుకుపోతూ ట్వంటీ-20లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. టి20 క్రికెట్ సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్ లో లంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది.

ఒక దశలో 46 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాలలో మునిగిన లంక జట్టును ఇశాని లకుసురియాగ్ తో పాటు అమ్మ కంచనాలు కలసి 8 విక్కెట్ కు మంచి బాగస్వామ్యం నెలకొల్పడంతో లంక కనీసం 89 స్కోరును బోర్డుపై పెట్టగలిగింది. కౌశల్య(25), జయాంగిని(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లంకను అత్యల్ప స్కోరుకే అలౌట్ చేయడంలో భారత స్పిన్నర్లు తమ సత్తా చాటారు. ఏక్తా బిష్త్ 3, అనుజ పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు.

90 పరుగుల టార్గెట్ ను 37 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి భారత్ చేరుకుంది. 13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు ఓపెనర్లు వెల్లస్వామి వనిత తో కలసి స్మృతి మందన చక్కటి భాగస్వామితో కలసి 8.3 ఓవర్లలో 64 పరుగులు సాధించారు. అయితే వెల్లస్వామి వనిత 25 బంతులలో 34 పరుగులు సాధించి వెనుదిరిగింది. దీంతో వన్ డౌన్ లో వచ్చిన వేదా కృష్ణమూర్తి జత కలసి మరో వికెట్ నష్టపోకుండా  నిర్ణీత లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. మంధన 43, వనిత 34, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు. అంతకుముందు రెండు టీ20లను గెలిచిన మిథాలి సేన.. ఈ విజయంతో క్లీన్ స్వీప్ చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian womens cricket team  Sri Lanka Women Cricket  Mithali Raj  Cricket  

Other Articles