Kohli sandwiched between ms dhoni and yuvraj singh in the flight

Virat Kohli, MS Dhoni, Yuvraj Singh, Asia Cup T20, Virat Kohli twitter, ms dhoni, yuv raj and kohli, cricket legends, asia cup twenty 20, virat teitter photo,India,Asia Cup

Virat Kohli will be key to India's chances in the Asia Cup T20 which starts in Dhaka from Wednesday

లెజెండ్స్ తో కలసి ఆసియా కప్ కు వెళ్తున్నా..

Posted: 02/23/2016 09:20 AM IST
Kohli sandwiched between ms dhoni and yuvraj singh in the flight

లెజెండ్స్ తో కలిసి ఢాకా వెళ్తున్నానంటూ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. తన బ్యాట్ తో పరుగుల వరద సృష్టించి.. టెస్ట్ కెప్టెన్ బాధ్యతలను కూడా అందుకున్న ఆటగాడు లెజెండ్స్ తో కలసి వెళ్తున్నానంటూ దానికి తోడుగా ఓ ఫోటోను కూడా జతపర్చాడు. ఆ ఫోటోలు వున్నది ఎవరో తెలుసా..? నిజంగా లెజెండ్స్. వారే పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ . వారిద్దరి మధ్య కూర్చున్న కోహ్లీ వారితో కలసి దిగిన సెల్పీ ట్విట్టర్ లో పెట్టాడు.

అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ తరువాత విశ్రాంతి తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి పంజాబ్ లోని అమృత్ సర్, వాఘా బోర్డర్ వంటి ప్రాంతాలకు వెళ్లాడు. అనంతరం ఆసియాకప్ ఆడనున్న భారత జట్టుతో కలిసి, బంగ్లాదేశ్ కు బయల్దేరాడు. ఈ సందర్భంగా విమానంలో ధోనీ, యువరాజ్ సింగ్ మధ్య కూర్చున్న కోహ్లీ, ఓ సెల్ఫీని తీసుకుని, 'లెజెండ్స్ తో ఢాకా' అంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. దీనికి ఈ ముగ్గురి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా, ఆసియా కప్ లో భాగంగా బుధవారం భారత జట్టు తొలి టీట్వంటీని ఆడనున్నంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MS Dhoni  Yuvraj Singh  Asia Cup T20  

Other Articles