West Indies overcome India to win maiden Under-19 World Cup title

Carty paul steer west indies to under 19 glory

india u19 vs west indies u19 live, live ind u19 vs wi u19, ind u19 vs wi u19 live, live ind u19 vs wi u19, india u19 west indies u19 live, ind vs wi world cup final, u19 world cup final live, live u19 world cup final, ind vs west indies u19 final live score, ind vs wi u19 match live score, u19 world cup final live, live score u19 world cup final

Keemo Paul and Keacy Carty maintained their composure in the thrilling run-chase as West Indies registered their maiden Under-19 World Cup win. They won by five wickets and three balls to spare

అండర్ 19 క్రికెట్ విశ్వవిజేత విండీస్.. రన్నర్ అప్ గా మిగిలిన యువభారత్

Posted: 02/14/2016 02:40 PM IST
Carty paul steer west indies to under 19 glory

అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంటు ఆరంభం నుంచి అత్యుత్తమ ప్రతిభతో రాణించిన యువ భారత్ జట్టు.. ఫైనల్ మ్యాచ్ లో మోకరిల్లింది. బంగ్గాదేశ్ లోని ఢాకా స్టేడియం వేదికగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా యువజట్టు వెస్టిండీస్ ఎదుట బొక్కబోర్లా పడింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తుదిపోరులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్గా సరిపెట్టుకుంది.  భారత్ విసిరిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విండీస్ ఇంకా మూడు బంతులుండగా విజయం సాధించి తొలిసారి కప్ను దక్కించుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు గిడ్రాన్ పోప్(3), ఇమ్లాక్(15) పెవిలియన్కు చేరారు. అనంతరం హేట్మైర్(23),స్పింగర్(3), గూలీ(3) కూడా అవుట్ కావడంతో విండీస్ 77 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించినట్లు కనబడింది.

కాగా, ఆ తరుణంలో కార్టీ(52నాటౌట్), కీమో పాల్(40) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ కప్ను అందుకుంది. దీంతో నాల్గో సారి కప్ను దక్కించుకుందామనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. 2000, 08, 12 సంవత్సరాల్లో వరల్డ్ కప్ ను గెలుచుకుని రికార్డు టైటిల్ పై కన్నేసిన యువ భారత్ పేలవ ప్రదర్శన కారణంగా పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్ కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. కాగా, అండర్ 19 వరల్డ్ కప్ లో రెండోసారి ఫైనల్ కు చేరిన విండీస్ అందరీ అంచాలను తల్లక్రిందులు చేసి తమలోని ప్రతిభకు కొదవలేదని నిరూపించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన యువ భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటయ్యింది. భారత ఆటగాళ్లలో సర్పరాజ్ ఖాన్(51), బాథమ్(21), లామ్రోర్(19) మినహా మిగతా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత స్వల్ప స్కోరుకే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో జోసఫ్, జాన్లకు తలో మూడు వికెట్లు సాధించగా, కీమో పాల్కు రెండు వికెట్లు లభించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Under-19 cricket World Cup final  West Indies  India  

Other Articles