Rana Naved, Humayun and Khalil retire from international cricket

Several pakistan cricketers announce retirement in a day

Rana Naved, Humayun Farhat, Muhammad Khalil, Yasir Hameed, Muhammad Yousuf, Abdul Razzaq, Imran Farhat, Taufiq Umar, PCB, Master Champions League, pakistan cricketers, Pakistan Super League, MCL, pakistan, cricket

Pakistan players have formally announced their retirements from international cricket, after the PCB declined to issue them NOCs to play Masters Cricket League in Dubai from January 28th.

సీనియర్లు లేక సంక్షోభం దిశగా పాక్ క్రికెట్

Posted: 01/14/2016 05:12 PM IST
Several pakistan cricketers announce retirement in a day

పాకిస్థాన్ క్రికెట్ జట్టు సంక్షోభం దిశగా పయనిస్తుంది. జట్టులో అవసరానికి అదుకునే సీనియర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్ల పాటు జట్టుకు అండదండగా వుంటూ వచ్చిన సీనియర్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయంతో మూకుమ్మడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనమిది మంది సీనియర్ క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ల వినతిపై విముఖంగా స్పందించిన క్రికెట్ బోర్డు నిర్ణయంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల చివరి నుంచి దుబాయ్ లో జరగనున్నా మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) లో ఆడాలనుకొంటున్న పలువురు ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ప్రకటించింది. దీంతో పిసీబీ తీసుకున్న నిర్ణయంపై తమ వ్యతిరేకతను చాటుతూ ఆ వెంటనే సీనియర్లు తమ మూకుమ్మడి రిటైర్ మెంటును ప్రకటించారు. అబ్దుల్ రజాక్, మొహమ్మద్ యూసుఫ్, ఇమ్రాన్ ఫర్హత్, తాఫీక్ ఉమర్, యాసిర్ హమీద్ తదితరులు ఆ వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడంతో పాక్ క్రికెట్ సంక్షోభంలో పడ్డట్టయింది.

ఆటగాళ్లు తక్షణం అధికారిక క్రికెట్ కు దూరమవుతున్నామని ప్రకటిస్తేనే, ఎంసీఎల్ లో ఆడవచ్చని పీసీబీ స్పష్టం చేయడంతో సీనియర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా మాస్టర్స్ ఛాంపియన్ ట్రాఫీ సమయంలోనే తమ పాకిస్థాన్ సూపర్ సిరీస్ కూడా కొనసాగుతుందని, అదే దుబాయ్ లో అవే వేదికలలో తమ పీఎస్ఎల్ మ్యాచ్ లు కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఎంసీఎల్ తమకు పోటీగా నిలుస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కన్నా ఎంసీఎల్ లో ఆడితే, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని భావిస్తున్న క్రికెటర్లు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan cricketers  Master Champions League  retirement  

Other Articles