Martin Guptill hits record fifty, teammate Colin Munro breaks it 16 minutes later

Martin guptill hits record fifty teammate colin munro breaks it 16 minutes later

Martin Guptill , Colin Munro, Sri Lanka, Eden Park, Newzeland

Fresh from blasting an incredible 93 off just 30 balls two weeks ago in the one-day arena, Guptill carried on belting the hapless Sri Lankans with a 19-ball fifty in a brutal nine-wicket defeat of the tourists in the second Twenty20 at Eden Park, Auckland. Guptill — who finished with 63 from 25 balls — added the fasted half-century by a Kiwi in T20 internationals to his impressive collection, which includes the second-fastest fifty in ODIs.

గుప్టిల్, కోలిన్ మన్రో వీర బాదుడు.. రికార్డులు దాసోహం

Posted: 01/10/2016 08:09 PM IST
Martin guptill hits record fifty teammate colin munro breaks it 16 minutes later

బ్యాట్ తో బాల్ ను కొడితే క్రికెట్ మరి అదే బ్యాట్ తో బాల్ ను వీరబాదుడు బాదితే.. రికార్డులు బ్రేక్ కాదు.. ముక్కలు ముక్కలు కావాల్సింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఒకరిని మించి ఒకరు బ్యాటింగ్ లో తమ ప్రతాపాన్ని చూపించారు. బాల్ ను బౌండరీలు దాటించడమే కాకుండా.. రికార్డులను అవలీలగా బ్రేక్ చేశారు. అయితే ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయా అన్న ఉత్కంట మధ్య కొత్త రికార్డులు రాసినా మన యువరాజ్ సింగ్ చేసిన రికార్డు మాత్రం బ్రేక్ కాలేదు. మన యువరాజ్ సింగ్ కొట్టిన 12 బాల్స్ హాఫ్ సెంచురీ జస్ట్ మిస్ అయ్యింది. ఒకటి 19 బాల్స్ లో నమోదు అయితే మరొకటి 14 బాల్స్ లో నమోదు అయింది. జస్ట్ రెండు బంతుల్లో యువరాజ్ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయేదే. అంతేకాదు ఈ రెండు హాఫ్ సెంచురీలు కేవలం 20 నిమిషాల్లో నమోదయ్యాయి.

ఆ రికార్డులు సృష్టించింది డబుల్ సెంచురీ హీరో అయిన మార్టిన్ గుప్టిల్ ఒకరు అయితే మరొకరు కోలిన్ మున్రో. ఆక్లాండ్‌లో శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో న్యూజిలాండ్‌ బ్యాట్స్ మెన్లు పరుగుల ప్రవాహం సృష్టించారు. 143 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 10 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి సాధించింది.న్యూజిలాండ్‌ ఓపెనర్‌ గుప్తిల్‌ 19బంతుల్లోనే అర్థశతకం సాధించి టీ20లో న్యూజిలాండ్‌ తరపున వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. అయితే 20 నిమిషాలు ముగియక ముందే వన్‌డౌన్‌లో వచ్చిన మున్రో 14 బంతుల్లోనే అర్ధశతకం(50, ఫోర్‌, 7 సిక్స్ లు) సాధించి గుప్తిల్‌ రికార్డును తిరగరాశాడు. అంతేకాకుండా టీ20లో అత్యంత వేగంగా అర్థశతకం చేసిన రెండో బ్యాట్స్ మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఒకే మ్యాచ్ లో న్యూజిలాండ్ తరుపున రెండు రికార్డులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Martin Guptill  Colin Munro  Sri Lanka  Eden Park  Newzeland  

Other Articles