Siril Verma is the new junior world No 1

Siril verma is the new junior world no 1

Siril Verma, ASS Siril Verma, the World Junior Championship

om despair to delight, this is the story of ASS Siril Verma, the new world No. 1 among junior men. He was hounded, accused of age fudging and even offloaded from the Indian team in October. The moment his name was announced as one of the four age fraudsters, Siril ran out of the hotel in disbelief, his mother followed him to save her son from being hit by speeding vehicles on busy Delhi roads.

బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ గా సిరిల్ వర్మ

Posted: 01/08/2016 04:28 PM IST
Siril verma is the new junior world no 1

మన వాళ్లు స్పోర్ట్స్ లో దూసుకెళుతున్నారు. నిన్న సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో టాప్ లోకి వెళితే నేడు అదే బాడ్మింటన్ లో జూనియర్ విభాగంలో మన క్రీడాకారుడు సిరిల్ వర్మ దూసుకెళ్లాడు. తాజాగా జూనియర్ విభాగంలో సిరిల్ వర్మ సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించి మరోసారి మన సత్తాను చాటాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ సంచలనం అండర్-19 విభాగం పురుషుల సింగిల్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని రికార్డు సృష్టించాడు. గతేడాది చివర్లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఫైనలిస్టుగా నిలవడంతో సిరిల్ ఏకంగా 11స్థానాలను మెరుగుపరచుకున్నాడు. ఫలితంగా.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జూనియర్స్‌లో సిరిల్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్ పొపోవ్ రెండోర్యాంకులో నిలవగా, భారత్‌కే చెందిన చిరాగ్ సేన్ మూడోర్యాంకుతో టాప్‌త్రీలో చోటు దక్కించుకున్నాడు.

సిరిల్ గతేడాది నవంబర్‌లో పెరూ దేశంలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో సింగిల్స్ రజతం నెగ్గిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించాడు. గతేడాదే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించిన సిరిల్..అదే ఏడాది ఆసియా యూత్ ఈవెంట్‌లో పతకం సాధించి తన సత్తాచాటుకున్నాడు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన సిరిల్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు చెందిన అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. గత నాలుగేండ్లుగా జూనియర్‌స్థాయిలో అద్భుతంగా ఆకట్టుకుంటున్న సిరిల్‌కు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సంస్థ సహకారం అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siril Verma  ASS Siril Verma  the World Junior Championship  

Other Articles