Dhoni Would think about retirement at right time

Dhoni would think about retirement at right time

Dhoni, Cricket, Indian cricket Tea, MahenderSingh Dhoni, Australia, Cricket Team, OneDayInternatinal, Cricket Series

India's limited overs captain Mahendra Singh Dhoni said he would think about quitting the game at the "right time". In fact, 34-year-old Dhoni was asked the same question about his retirement after India's exit from ICC World Cup and he had then denied that he had such plan.

రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ధోనీ

Posted: 01/06/2016 10:55 AM IST
Dhoni would think about retirement at right time

క్రికెట్‌ నుంచి తప్పుకోవటంపై సరైన సమయంలో ఆలోచిస్తానని టీమ్‌ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పేర్కొన్నాడు. ' వాస్తవికంగా జీవించే వ్యక్తుల్లో నేను ఒకడిని. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌, టీ20 వరల్డ్‌కప్‌లో జట్టును నడిపించటంపైనే నా దృష్టి. రిటైర్మెంట్‌పై సరైన సమయంలో ఆలోచిస్తాను' అని ధోని అన్నాడు. 2015 వరల్డ్‌కప్‌ సెమీస్‌ ఓటమి తర్వాతా ఇదే ప్రశ్న ఎదుర్కొన్న మహి.. రిటైర్మెంట్‌ ఆలోచన లేదని చెప్పటం గమనార్హం. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి మెరుగైన విజయాలు సాధిస్తున్న సమయంలో.. అన్ని ఫార్మాట్లలో సారథ్య పగ్గాలు కోహ్లికే అప్పగించాలనే డిమాండ్‌ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు గత ఏడాది కాలంగా ధోని బ్యాట్స్‌మన్‌ నామమాత్రమైన ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడాడు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత కెప్టెన్‌గా ధోని భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కొన్నాండ్లుగా వార్తలొస్తున్న నేపథ్యంలో మహి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంగారూలతో టీ20, వన్డే సిరీస్‌ నిమిత్తం జట్టు ఆస్ట్రేలియా బయల్దేరే ముందు ధోని మీడియాతో మాట్లాడాడు.

మనీశ్‌, గుర్‌కీరత్‌లకు అవకాశం : వన్డేల్లో సురేశ్‌ రైనా లేకపోవటంతో అతని స్థానంలో ఎవరిని ఆడనించాలనే విషయంపై కెప్టెన్‌ ధోని స్పష్టతనిచ్చాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 5,6,7 స్థానాల్లో ఆడటం ఎల్లప్పుడూ క్లిష్టమే. టాప్‌ ఆర్డర్‌లో శిఖర్‌, రోహిత్‌, కోహ్లి, రహానే రూపంలో అద్భుత బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. కానీ ఎంతటి బ్యాట్స్‌మన్‌కు ఐనా లోయర్‌ ఆర్డర్‌లో ఆడటం కష్టసాధ్యమే. మనీశ్‌ పాండే, గుర్‌కీరత్‌ మన్‌ సింగ్‌లలో ఒకరికి రైనా స్థానం దక్కనుంది. ఎవరికి అవకాశం దక్కినా ఐదో స్థానంలో ఆడించేందుకే మొగ్గుచూపుతాం అని ధోని అన్నాడు. 2015 వరల్డ్‌కప్‌ భారత్‌కు మంచి టోర్నీ. టోర్నీలో సెమీస్‌ మినహా అద్భుతంగా ఆడాం. బలమైన ప్రత్యర్థి స్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలే. కొత్త ఆటగాళ్లకు ఇదో అవకాశం. దేశవాళీ ప్రదర్శనను అంతర్జాతీయ వేదికపై ఎలా చూపగల్గుతారనే దానిపై భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది' అని మహి పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles