VVS Laxmans 281 voted best Test innings of last 50 years

Vvs laxmans 281 voted best test innings of last 50 years

VVS Laxman, Cricket, Record in cricket, VVS kaxman ever record, Indian cricket records, best Test innings of last 50 years

Eclipsing several other great individual knocks, V V S Laxman’s masterly innings of 281 against Australia at the Eden Gardens in Kolkata has been rated as the greatest Test performance of the last 50 years. The honour was accorded to the Hyderabad stylist’s fabulous series-turning knock after India trailed by 274 runs on the first innings, by his fellow-players, commentators and journalists in a poll published in the January issue of ESPN’s digital magazine the Cricket Monthly, a media release said.

యాభై ఏళ్లలలో బెస్ట్ రికార్డ్.. వివియస్ లక్ష్మణ్ సొంతం

Posted: 01/05/2016 01:05 PM IST
Vvs laxmans 281 voted best test innings of last 50 years

క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు ఉండొచ్చు కానీ భారత్ నుండి వచ్చిన క్రికెటర్లు క్రియేట్ చేసిన రికార్డ్ లను ఎన్నటికీ మరిచిపోలేదు ఈ ప్రపంచం. అది కపిల్ దేవ్ నుండి సచిన్ వరకు ఎవరైనా సరే మన క్రీడాకారులకు సలాం చెయ్యాల్సిందే మరి. యాభై సంవత్సరాల క్రికెట్ చరిత్రలో మన క్రికెటర్ అందునా తెలుగు వాడు క్రియేట్ చేసిన రికార్డ్ ఎన్నటికీ చెరిగిపోనిదని గుర్తింపుసాధించింది. తెలుగు తేజం వివియస్ లక్ష్మణ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 281 పరుగుల ఇన్నింగ్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్రదర్శనగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది. ఈఎస్పీఎన్ డిజిటల్ మ్యాగజైన్ 'క్రికెట్ మంత్లీ' కోసం క్రికెట్ మాజీ ఆటగాళ్లు, కామెంటేటర్లు, జర్నలిస్టులతో నిర్వహించిన పోలింగ్‌లో టాప్ 50 అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ ఇన్నింగ్స్‌కే ఓటు వేశారు

ఈ టెస్టులో ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటై 274 పరుగుల ఫాలోఆన్‌లో పడింది. ఫాలోఆన్‌లో పడిన మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లక్ష్మణ్ అద్భుతైన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 657 పరుగులు చేసింది. అంతేకాదు ఆసీస్‌ను 212 పరుగులకే అవుట్‌ చేసి 171 పరుగులతో చారిత్రక విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసిన లక్ష్మణ్‌, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఒక స్థానం ముందుకు జరిగి వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదో వికెట్‌కు రాహుల్ ద్రవిడ్‌(180)తో కలిసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆసీస్ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ సైతం వీవీఎస్‌ లక్ష్మణ్ ఆడిన ఆట తీరును గుర్తు చేసుకున్నాడు. ‘ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్‌ బౌలింగ్‌ చేయడం ఎంతో కఠినంగా అనిపించింది. అన్ని బంతులను కవర్స్‌ లేదా మిడ్‌ వికెట్‌ మీదుగా ఆడాడ'ని వార్న్‌ ప్రశంసించాడు.

లెగ్‌ సైడ్‌ దిశగా వీవీఎస్‌ లక్ష్మణ్ ఆడిన షాట్లు ఆశ్చర్యపోయేలా చేశాయని ఆస్టేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. రెండు రోజుల పాటు వీవీఎస్‌ను బౌలింగ్‌తో ఔట్ చేయలేకపోయామని అన్నాడు. ఇక ఆ టెస్టు ఆడిన సమయంలో వెన్ను నొప్పిని భరించలేక వీవీఎస్‌ నేలపై పడుకున్నాడని అతడి రూమ్‌మేట్‌, మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ గుర్తు చేసుకున్నాడు. కాగా టాప్ 50 జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరు లేకపోవడం విశేషం. టాప్ 50 జాబితాలో వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ బ్రియానా లారా అత్యధికంగా నాలుగు ఎంట్రీలు సాధించాడు. ఓవల్‌లో 1976లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 14 వికెట్లు తీసిన మైకేల్‌ హోల్డింగ్‌ ప్రదర్శనకు మూడో స్థానం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles