Scottish police investigate death of Sussex cricketer Matthew Hobden

Sussex bowler matthew hobden passes away at 22

Matthew Hobden, Sussex, England, ECB, England Performance Programme, Sussex cricketer, Matthew Hobden died, england

Sussex fast bowler Matthew Hobden passed away at the age of 22, the England and Wales Cricket Board (ECB) announced on Sunday

రాలిపోయిన మరో యువ క్రికెట్ దృవతార

Posted: 01/03/2016 04:10 PM IST
Sussex bowler matthew hobden passes away at 22

ఇంగ్లండ్ కౌంటీ ఆటగాడు, సస్సెక్స్ క్రికెటర్ మథ్యూ హోబ్డెన్(22) శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కౌంటీ క్లబ్ ఆదివారం వె  ¿£ల్లడించింది. మథ్యూ హోబ్డెన్ ఈస్ట్ బార్న్లో జన్మించాడు. 2014లో కౌంటీ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ఫాస్ట్ బౌలర్ హోబ్డెన్ మూడు ఫార్మాట్లలోనూ మ్యాచ్లు ఆడాడు. గత ఆగస్టులో ఎస్సెక్స్ తో జరిగిన మ్యాచ్లో చివరిసారిగా మైదానంలో కనపించాడని క్లబ్ పేర్కొంది. సస్సెక్స్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన హోబ్డెన్ 39.35 సగటుతో 48 వికెట్లు పడగొట్టాడు. 11 కౌంటీ మ్యాచుల్లో 48.43 సగటుతో 23 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, మాట్ ప్రియర్ హోబ్డెన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోబ్డెన్ కుటుంబం, మిత్రులకు ఇది గడ్డుకాలమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. హోబ్డెన్ అతిపిన్న వయసులో చనిపోవడంపై సస్సెక్స్ జట్లు అతడి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. గత రెండు సీజనల్లో సస్సెక్స్ జట్టులో ఉంటూ అన్ని ఫార్మాట్లలో ఆటను కొనసాగించాడు. మాట్ యువ బౌలర్, మంచి ఆటతీరు గలవాడని ప్రొఫెషనల్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో అంగస్ పోర్టర్ స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sussex cricketer  Matthew Hobden died  england  

Other Articles