Test | Yuvraj | Harbhajan | Nehra | Natl T20

Test for yuvraj harbhajan nehra as natl t20 starts tomorrow

yuvraj singh, yuvraj, ipl, ipl 2016, delhi daredevils, virender sehwag, sehwag, ipl news, ipl auction, ipl 9, ipl 9 auction, ipl list, ipl cricket, ipl news

Veterans Yuvraj Singh, Harbhajan Singh and Ashish Nehra would like to get some quality match time before the T20 series in Australia

యువరాజ్, బజ్జీ, నెహ్రాలకు పరీక్ష

Posted: 01/01/2016 05:16 PM IST
Test for yuvraj harbhajan nehra as natl t20 starts tomorrow

గత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ఆ జట్టు మరోమాట లేకుండా  ఈ సీజన్ లో వదిలేసిందంటే అతని ప్రదర్శన వారికి ఎంత చిరాకు తెప్పించి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది యువీకి పెద్దగా కలిసి రాకపోయినా..  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఎంపిక ఒక్కటే అతనికి ఒక మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది.

కాగా, ఇక్కడ కూడా యువరాజ్ ను ట్వంటీ 20లకే పరిమితం చేసి అతని మదిలో ఏదో వెలితిని రేకెత్తించారు సెలక్టర్లు. తనను మొత్తంగా తప్పించడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారా? లేక వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేశారా ? అనే దానిపై కూడా యువీ తేల్చుకోలేకుండా ఉన్నాడు. ఈ సమయంలోనే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి యువీని తప్పించడం నిజంగానే అతనికి చేదు వార్త. అయితే ఇంకా  ఫిబ్రవరిలో జరిగే వేలం రూపంలో యువీకి ఎంతో కొంత ఆశలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ యువీని మరో జట్టు కొనుగోలు చేయాలంటే మరోసారి బ్యాట్ ఝుళిపించకతప్పదు.

ఈ తరుణంలో యువీ బ్యాట్ తో మెరవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్వంటీ 20 టోర్నమెంట్ వచ్చేసింది.  శనివారం నుంచి ఆరంభం కానున్న ఈ దేశవాళీ లీగ్ లో 27 రాష్ట్రాల జట్లు పాల్గొంటున్నాయి. యువీతో పాటు ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ ల వంటి వెటరన్ ఆటగాళ్ల కెరీర్ మరికొంత కాలం ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా ఇక్కడ రాణించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా యువీ భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారకుండా ఉండాలంటే  ఇదే అతనికి సరైన వేదిక. భారత్ లోనే అత్యంత క్రేజీ లీగ్ గా పెరుతెచ్చుకున్న ఐపీఎల్ లో   తిరిగి స్థానం పొందాలంటే ఈ టోర్నమెంట్ లో యువీ రెచ్చిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు గ్రూప్-బిలో జరిగే తొలి పోరులో యువరాజ్ , హర్భజన్ లున్న పంజాబ్ తో రాజస్థాన్ తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvaraj singh  cricket  natl-t20  

Other Articles