Williamson ton wraps up series for New Zealand

New zealand clean sweeps series against sri lanka

sri lanka new zealand, new zealand sri lanka, sri lanka new zealand test, sri lanka vs new zealand 2015, cricket news, cricket

Kane Williamson added to an already glittering resume as he led New Zealand to a five-wicket victory in Hamilton to wrap up the two-Test series against Sri Lanka.

టెస్టు సిరీస్ కివీస్ వశం.. లంకకు పరాభవం..

Posted: 12/21/2015 06:21 PM IST
New zealand clean sweeps series against sri lanka

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ చేజిక్కించుకుంది. చివరి టెస్టులో శ్రీలంక నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి రోజు ఆటలో భాగంగా  142/5 ఓవర్ నైట్ స్కోరుతో  సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ మరో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.
 
న్యూజిలాండ్ ఆటగాళ్లలో విలియమ్సన్(108 నాటౌట్;164 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో రాణించి జట్టు ఘన విజయంలో కీలక పాత్రపోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కేవలం రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మాత్రమే ఓ మోస్తరుగా రాణించిన శ్రీలంక... మొదటి టెస్టులో 122 పరుగులతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.  దీంతో రెండు టెస్టుల సిరీస్ ను కివీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా,  ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ డిసెంబర్ 26 వ నుంచి ఆరంభం కానుంది.
 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 292 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 133 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 237 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 189/5

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilnaka  New Zealand  second test  hamilton  

Other Articles