Kevin Pietersen slams Qantas 'muppets' over dress code

Kevin pietersen lets rip at qantas muppets

Kevin Pietersen has let fly at Qantas over their refusal to let him into their lounge because of his footwear.

Kevin Pietersen has let fly at Qantas over their refusal to let him into their lounge because of his footwear.

వాళ్లకు పూర్తిగా వెర్రే.. పిటర్సన్ ఆగ్రహం..

Posted: 12/15/2015 06:01 PM IST
Kevin pietersen lets rip at qantas muppets

ఆస్ట్రేలియా క్వాంటాస్ ఎయిర్ పోర్టులో ఇంగ్లాండ్ మాజీ అటగాడు కెవిన్ పిటర్సన్ కు చేదు అనుభవం ఎదురైంది. దీనిపై ఆయన తీవ్ర అసనహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాష్ లీగ్ లో మెల్బొర్న్ స్టార్స్ జ్టు తరుపున పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన పీటర్సన్ కు సిడ్నీ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. అంతకుముందు ఎన్నడూ ఎదురుకాని ఈ వింత పరిస్థితి ఎదురుకావడంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఇందుకు కారణం పీటర్సన్ ను  క్వాంటాస్ ఎయిర్ లైన్ విశ్రాంతి గదిలో అనుమతించక పోవడమే. అదేంటి స్టార్ అటగాడిని అక్కడి విమానాశ్రయం అధికారులు ఎందుకు అడ్డుకున్నారు ? వివరాల్లోకి వెళ్తే..

గతంలోని వున్న నియమనిబంధలను ఈ ఏడాది తొలినాళ్లలో అక్కడి ప్రభుత్వం మార్చింది. దీంతో మారిన రూల్స్ ను బట్టి పిటర్సన్ ను విశాంత్రి గదిలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో తన ఒంటిపై ప్లాస్టిక్ ను పోలిన కొన్ని వస్తువులు ఉన్న కారణంగా విశ్రాంతి గదిలోకి రానివ్వలేదని పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని ఎదురుకాని పిటర్సన్.. క్వాంటాస్ ఎయిర్ సర్వీస్ అధికారులను తిట్టిపోశాడు. క్వాంటాస్ ఎయిర్ వేస్ ను 'వెర్రి' ఎయిర్ వేస్ గా పోలుస్తూ ట్వీట్ చేశాడు.  దీనిపై క్వాంటాస్ ఎయిర్ వేస్ దిగివచ్చి పీటర్సన్ కు క్షమాపణలు చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో డ్రెస్ కోడ్ నిబంధనలను కఠినతరం చేసిన కారణంగానే పీటర్సన్ పట్ల తమ సిబ్బంది అలా ప్రవర్తించి ఉంటారని సర్దుచెప్పుకునే ప్రయత్నం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kevin Pietersen  Qantas  flipflops  lounge  Big Bash League  

Other Articles