2016 WT20 schedule is out! India face rivals Pakistan on March 19

World t20 2016 india pakistan placed in the same group

india, pakistan, dharmashala, icc t-20 world cup, ICC World Twenty20, ICC WT20, World T20 schedule, 2016 World T20, WT20, India vs Pakistan, West Indies, England,, 2016 cricket, World Twenty20 schedule, fixtures

Arch-rivals India and Pakistan were today placed in the same group for next year's ICC World Twenty20, setting the stage for a high-voltage clash between the two sides on 19 March in Dharamsala.

ధాయాధుల మధ్య పోరుకు ధర్మశాల వేదిక

Posted: 12/11/2015 06:04 PM IST
World t20 2016 india pakistan placed in the same group

ధాయాది దేశాల మధ్యన ఈ నెలలో జరగాల్సిన ఇండో పాక్ సిరీస్ రద్దు కావడంతో ఎంతో మంది క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్న నేపథ్యంలో పోట్టిఫార్మెట్ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్.. నిజంగానా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఐసీసీ తీపికబురు అందించింది. దాయాధులిద్దరి మధ్య మార్చి 19న పోరుకు ముహూర్తం ఖరారైంది. అందుకు ధర్మశాలలోని స్టేడియం వేదికగా నిలువనుంది.

టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉన్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  pakistan  dharmashala  icc t-20 world cup  

Other Articles