australia won by 3 wickets in third test and achieves test series

Cricket oz clinch three wicket victory

australia vs new zealand 2015-16, brendon mccullum, australia, new zealand, cricket, cricket news, josh hazlewood, steven smith, maiden day night match, maiden pink ball match

Australia won the first ever day-night cricket test by 3 wickets against New Zealand, with tail-ender Peter Siddle ushering the hosts to victory in a dramatic finish under lights.

న్యూజీలాండ్ పై సిరీస్ విజయం సాధించిన అసీస్

Posted: 11/29/2015 04:24 PM IST
Cricket oz clinch three wicket victory

న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల క్రికెట్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలిసారి ఇరు జట్ల మధ్య ప్రయోగాత్మకం ప్రవేశపెట్టిన డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకుంది.న్యూజిలాండ్ విసిరిని 187 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్  ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది.

ఈ నేపథ్యంలో కీలకమైన మ్యాచ్ లో అందులోనూ ప్రయోగాత్మకంగా సాగిన డే-నైట్ మ్యాచ్ లో నూ విజయం సాధించి సిరీస్ ను తన పేరును రాసుకుంది అసిస్. 116/5 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు  రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 208 పరుగులకు ఆలౌటయింది. అనంతరం సాధారణ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ పోరాడి గెలిచింది. ఒకపక్క బౌల్ట్ పదునైన బంతులతో ఆసీస్ ను ఇబ్బందిపెట్టినా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ఆసీస్ ఆటగాళ్లలో  డేవిడ్ వార్నర్ (35),షాన్ మార్ష్(49), మిచెల్ మార్ష్(28)లు ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(14), బర్న్స్(11), నేవిల్(10)లు నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లు సాధించాడు.
 
న్యూజిలాండ్
తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్,
రెండో ఇన్నింగ్స్ 208 ఆలౌట్

ఆస్ట్రేలియా
తొలి ఇన్నింగ్స్ 224 ఆలౌట్,
రెండో ఇన్నింగ్స్ 187/7

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  New Zealand  first day night match  

Other Articles