Chinese legspinner Ming Li signs for Sydney Sixers on Big Bash rookie contract | Chinese cricketer Ming Lee news

Sydney sixers sign chinese spinner ming lee for 2015 16 big bash league

chinese cricketer ming lee, big bash league, ming lee signs big bash league, shane warne, big bash league latest season, sydney sixers

Sydney Sixers sign Chinese spinner Ming Lee for 2015-16 Big Bash League : A Chinese spinner who got his start in cricket watching Shane Warne videos on YouTube has earned a rookie contract with the Sydney Sixers.

‘బీబీఎల్’లో తొలి చైనీ క్రికెటర్ కు అవకాశం

Posted: 11/23/2015 06:41 PM IST
Sydney sixers sign chinese spinner ming lee for 2015 16 big bash league

ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ 20 బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో తొలిసారి చైనాకు చెందిన మింగ్ లీ అనే క్రికెటర్ పాల్గొంటున్నాడు. ఈ సమ్మర్ సీజన్ లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో భాగంగా మింగ్ ను సిడ్నీ సిక్సర్స్ కొనుగోలు చేసింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చిన సీఏకు, హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడానికి బిగ్ బాష్ లీగ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

అంతకుముందు 2004లో హాంకాంగ్ తరపున మింగ్ క్రికెట్ రంగంలోకి ఆరంగేట్రం చేశాడు. తాను క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడానికి ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ స్ఫూర్తి అని మింగ్ తెలియజేశాడు. వార్న్ వీడియోలను యూట్యూబ్ లో తరచు చూస్తూ ప్రేరణ పొందేవాడేనని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా క్రికెట్ ఆటలో లింగ్ కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉందని సిడ్నీ సిక్సర్స్ మేనేజర్ డొమినిక్ రేమాండ్ తెలియజేశాడు. తాము హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్ కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinese cricketer ming lee  big bash league  

Other Articles