India vs South Africa 2nd Test : Rain washes out third days play in Bengaluru | india vs sout

Rain washes out third days play of india vs south africa 2nd test in bengaluru

india vs south africa, south africa match, india vs south africa test series, india south africa test series, bangalore chinna swamy stadium, rains in bangalore

Rain washes out third days play of India vs South Africa 2nd Test in Bengaluru : The third day's play in the second cricket Test between India and South Africa was called off without a ball being bowled after persistent showers forced the officials to take an early call

వరుణుడి కారణంగా మూడరోజూ మ్యాచ్ బంద్

Posted: 11/16/2015 01:50 PM IST
Rain washes out third days play of india vs south africa 2nd test in bengaluru

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు తీరని అడ్డంకిగా మారాడు. ఈ వర్షం కారణంగా మూడోరోజైన ఆట రద్దయ్యింది. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ఆట ప్రారంభమయ్యే అవకాశం లేకపోవడంతో రద్దు చేయడం జరిగింది. దీంతో.. నిన్న, ఈరోజు వరుసగా రెండు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. ఈ దెబ్బతో ఆట కేవలం మరో రెండు రోజులు మాత్రమే మిగిలి వుంది.

బెంగుళూరులో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనిస్తుంటే.. రేపు కూడా ఆట జరిగే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేపు కూడా ఈ తరహాలోనే వర్షం కుండపోతగా కురిసే ఛాన్స్ వుందని భావిస్తున్నారు. అలాకాకుండా ఒకవేళ ఆట ఏదో ఒక సమయంలో ప్రారంభమైనా.. మధ్యమధ్యలో వరుణుడు అడ్డంకిగా మారవచ్చునని, అప్పుడు ఆట సజావుగా సాగుతుందనే అంచనాలు కూడా లేవని అనుకుంటున్నారు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదిలావుండగా.. తొలిరోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా 214 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేసి మెరుగైన స్థితిలో వుంది. మురళీ విజయ్ (28), శిఖర్ ధావన్ (45) క్రీజులో వున్నారు. ఈ మ్యాచ్ కూడా ఇండియానే గెలుస్తుందని అంతా అనుకున్నారు కానీ.. వరుణుడి కారణంగా అవి బోల్తా పడ్డాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs south africa  bangalore rains  

Other Articles