ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లను పరాజయం పాలైన సచిన్ బ్లస్టర్ జట్టు చివరి టీ-20లోనూ ఓటమిని చవిచూసి.. వార్న్ వారియర్స్ చేతిలో క్లీన్ స్పీప్ చేయబడింది. కనీసం చివరి మ్యాచ్ లోనైనా సచిన్ బ్లాస్టర్స్ గెలుస్తుందని ఆశించిన అభిమానుల అంచాలనాలను తలకిందులు చేస్తూ.. పరాజయం పాలైంది. చివరి మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చెలరేగి అర్థ శతకాలతో రాణించినా నిష్పలంగానే మారింది. దీంతో ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ ను షేన్ వార్న్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఉత్యంఠభరితంగా జరిగిన చివరి మ్యాచ్ లో సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్లాస్టర్స్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని మరొక బంతి మిగులుండగానే చేరుకుంది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో షేన్ వార్న్ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. సంగక్కర 42 (21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కల్లిస్ 47 (23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పాంటింగ్ 43 (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సైమండ్స్ 31, హేడన్ 12, జాంటి రోడ్స్ 17 పరుగులు చేశారు. స్వాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆంబ్రోస్, హూపర్, సెహ్వాగ్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తమ ప్రత్యర్థి వార్న్ వారియర్స్ ముందు 220 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సచిన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు. గంగూలీ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. సెహ్వాగ్ 27, జయవర్ధనే 41, హూపర్ 33 పరుగులు సాధించారు. వారియర్స్ బౌలర్లలో వెటోరి 3 వికెట్లు పడగొట్టాడు. సైమండ్స్, వాల్ష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more