Yuvraj Singhs Cheeky Response to Marriage Rumours

Yuvraj singhs cheeky response to marriage rumours

Yuvraj Singh, Yuvraj Singh on marriage, Yuvraj Singh tweet, Yuvraj Singh news, Yuvraj Singh with Hazel Keech, Hazel Keech dating with Yuva Raj singh

India cricketer Yuvraj Singh has vehemently denied rumours surrounding his marriage with British-born model-cum-actress Hazel Keech in February next year. The all-rounder took to Twitter to quash claims that he will be getting married in February next year.

పెళ్లి డ్రెస్ లో వస్తానంటున్న యువీ

Posted: 11/05/2015 05:41 PM IST
Yuvraj singhs cheeky response to marriage rumours

యువరాజ్ సింగ్ క్రికెట్ కన్నా మిగితా విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో 16 కోట్లకు ఐపియల్-8 సీజన్ లో అత్యధికంగా అమ్ముడుపోయి.. రికార్డులు సృష్టించారు. కానీ ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఒకటి అర పరుగులు చేసి అలా ఫెవీలియన్ బాట పట్టారు యువీ. అయితే తాజాగా యువరాజ్ ఆటకన్నా పెళ్లి వార్తలు ఎక్కువయ్యాయి. యువరాజ్ సింగ్ పలానా అమ్మాయితో తిరుగుతున్నారు.. దాదాపు అంతా ఓకే అయింది.. పెళ్లికి అంతా సిద్దంగా ఉంది అని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద యువీ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పెళ్లి దుస్తుల్లో వస్తానంటూ క్లారిటీ ఇచ్చారు.

యువరాజ్ సింగ్ తన పెళ్లి మీద వస్తున్న వార్తల మీద ఓ స్పష్టతనిచ్చాడు. తాజాగా చేసిన ట్వీట్ అన్ని విషయాలను కుండబద్దలు కొట్టింది. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పెళ్లిపై వచ్చిన వదంతులపై చిలిపిగా స్పందించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. మీడియా వాళ్లు తన పెళ్లి ని నిశ్చయించేశారు... వివాహవేదిక ఎక్కడో కూడా చెబుతున్నారు... తేదీ కూడా మీడియా చెబితే, ఆరోజు చక్కగా తయారై ముహుర్తం సమయానికి వస్తాను అంటూ యువీ  చిలిపిగా  ట్వీట్ చేశాడు. కాగా, స్పోర్ట్స్ వేగన్. ఇన్ లో యువరాజ్ సింగ్ పెళ్లి కుదిరిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బ్రిటిష్ మోడల్, నటి అయిన హాజెల్ కీచ్ ను వివాహం చేసుకోనున్నాడన్న వార్తలు ప్రచురించింది. కొన్ని నెలలుగా వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పేర్కొంది. అయితే, ఈ వార్తలను యువరాజ్ ఖండించాడు. మొత్తానికి మీడియా వార్తలకు ఇలా చిలిపిగా స్పందించడం కూడా మీడియాలో వార్తలా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles