India, Pakistan must talk to revive cricket, says Sunil Gavaskar

India and pakistan must talk if we want revive cricket sunil gavaskar

India, Pakistan must talk to revive cricket, sunil gavaskar, sunil gavaskar india, sunil gavaskar india cricketer, india sunil gavaskar, india pakistan cricket, indo-pak cricket, cricket news, cricket

Sunil Gavaskar, popular across the borders for his superlative batting, said the mistrust between the two countries should be removed.

చర్చలే ఆ సిరీస్ సమస్యను పరిష్కరిస్తాయి

Posted: 11/02/2015 07:17 PM IST
India and pakistan must talk if we want revive cricket sunil gavaskar

భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ మునుపటి మాదిరిగానే కోనసాగాలంటే భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుందని మాజీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. రెండు దేశాల మధ్య డిసెంబర్ ‌- జనవరిలో జరగాల్సిన సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ నుంచి స్పందన కోసం పిసిబి ఎదురు చూస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి కోరామని, పది రోజుల్లోగా సిరీస్ పైన జవాబిస్తామని బీసీసీఐ చెప్పింది. దీంతో సిరీస్‌ జరగడం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య అపనమ్మకాన్ని తొలగించాలని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఇస్లామాబాద్, ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగి అవి ఫలప్రదంగా ముగిస్తేనే ఈ సిరీస్ కొనసాగతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఏ సమస్యను పరిష్కరించుకోవాలన్నా ముందు సంప్రదింపులు ముఖ్యమని చెప్పాడు. మాట్లాడుకోనంత వరకు ఏ సమస్యకూ పరిష్కారం దొరకదన్నాడు. ఏ ఆటకూ ప్రభుత్వ అభిప్రాయాన్ని మార్చే శక్తి లేదని, అయితే రెండు దేశాలు పోటీ పడ్డప్పుడు, ఆయా దేశాల అభిమానులు వచ్చి మ్యాచ్‌లు చూసి, కలుపుగోలుగా ఉండి పరిస్థితులను అర్థం చేసుకుంటే.. ఆ పరిణామాలు ప్రభుత్వానికి ఓ సంకేతాన్నిస్తాయన్నాడు. నేను రాజకీయ నాయకుణ్ని కాదని, ఒక మాజీ ఆటగాడిగా మాట్లాడుతున్నానని చెప్పాడు. ఏ సమస్య అయినా మాట్లాడుకుంటేనే పరిష్కారమవుతుందన్నాడు. ఐతే మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదని, బాగా ఆలోచించిన తర్వాతే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని గవాస్కర్ అన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  pakistan  cricket  sunil gavaskar  bcci  pcb  

Other Articles