pcb | pakistan cricketers | BPL | bangladesh premier league

Pcb allows players to play in bangladesh premier league

bangladesh, Bangladesh Premier League, bpl, cricket, cricket news, karachi, Muhammad Aamir, pakistan, Pakistan Cricket Board, pcb

The Pakistan Cricket Board (PCB) has decided to allow its players to take part in the Bangladesh Premier League (BPL) including left arm pacer Muhammad Amir.

25 మంది పాక్ క్రికెటర్లకు అనుమతి..

Posted: 11/01/2015 04:59 PM IST
Pcb allows players to play in bangladesh premier league

ఫోట్టి ఫార్మెట్ క్రికెట్ లీగ్ లు కాసులను రాల్చే లీగ్ లుగా మారడంతో.. క్రికెట్ ను ప్రధానంగా ఆటగా అధరిస్తున్న అన్ని దేశాలు ఈ ఫార్మెట్లను తెరమీదకు తీసుకువస్తున్నాయి. భారత్ తరువాత అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ దిశగా అడుగులు వేస్తుండగానే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏకంగా షెడ్యూలును విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 25 వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. ఇందుకు వేధికలను కూడా ఖరారు చేసింది. కాగా ఈ లీగ్ లో అడేందుకు ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లకు అనుమతినిచ్చింది.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) లో అడటంపై కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెరదించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆదివారం పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లను ఆపాలని తాము కోరుకోవడంలేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దాదాపు 25 మంది పాక్ ఆటగాళ్లు బీపీఎల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదు సంవత్సరాలు నిషేధానికి గురైన మహ్మద్ అమిర్ కూడా పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pcb  pakistan cricketers  BPL  bangladesh premier league  

Other Articles