Ranji Trophy: Gurkeerat stars as Punjab beat Andhra inside two days

Punjab beat andhra by seven wickets

Ranji Trophy, cricket, cricket news, Sarabjit Ladda, Ranji Trophy 2015-16, Punjab vs Andhra, Mandeep Singh, Gurkeerat Singh, andhra,andhra vs punjab,andhra vs punjab 2015-16,india,punjab,punjab vs andhra,punjab vs andhra 2015-16,ranji trophy,ranji trophy 2015-16,ranji trophy 2015-16

Allrounder Gurkeerat Singh Mann registered his career best bowling figures as Punjab defeated a sorry Andhra by seven wickets on the second day of their group B Ranji Trophy match,

రంజీ మ్యాచ్: ఆంధ్రపై పంజాబ్ 7 వికెట్ల విజయం

Posted: 10/31/2015 07:27 PM IST
Punjab beat andhra by seven wickets

రంజీ ట్రోఫీ గ్రూప్ బి లో ఆంధ్ర-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఇరు జట్ల మద్య సాగిన మ్యాచ్ లో అధ్యంతం బౌలర్లు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఆరంభమైన మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు విశేషంగా రాణించి మొత్తంగా 33 వికెట్లు నేలకూల్చారు. తొలి రోజు 17 వికెట్లు నేలకూల్చిన బౌలర్లు.. రెండో రోజు 16 వికెట్లను తీశారు. దీంతో నాలుగు రోజుల జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది. ఆద్యంతం బౌలర్ల హవానే నడిచిన ఈ మ్యాచ్ లో ఆంధ్రపై  పంజాబ్ ఏడు  వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆంధ్ర 45 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలగా, పంజాబ్ 147 పరుగులకు ఆలౌటయ్యింది.

128/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన పంజాబ్ మరో 19 పరుగులు వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర 133 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్  స్పిన్నర్ గుర్ కీరత్ సింగ్ ఐదు వికెట్లు తీసి ఆంధ్రను చావుదెబ్బ తీశాడు. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్ లో  కేఎస్ భరత్(39), ప్రశాంత్(29), ప్రదీప్ (26), శశికాంత్(15)లు మాత్రమే రెండంకెల మార్కును చేరిన వారిలో ఉన్నారు. ఆంధ్ర  ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పంజాబ్ కు నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ సాధించింది. పంజాబ్  రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 52 పరుగులకు తొమ్మిది వికెట్లను పడగొట్టిన గుర్ కీరత్ సింగ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

స్కోరు వివరాలు :

* ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 80 ఆలౌట్
* రెండో ఇన్నింగ్స్ 133 ఆలౌట్

* పంజాబ్ తొలి ఇన్నింగ్స్  147 ఆలౌట్
* రెండో ఇన్నింగ్స్ 67/3

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  cricket news  Sarabjit Ladda  Ranji Trophy 2015-16  Punjab vs Andhra  

Other Articles