India vs South Africa 5th ODI: Players to watch out for in series decider in Mumbai

India vs south africa 2015 5th odi at mumbai series set for high voltage finale

India vs south africa,India vs South Africa 5th ODI Players,India vs South Africa 5th ODI,India vs South Africa 5th ODI key players,Players to watch out for in 5th ODI,India vs South Africa 5th ODI teams,India vs South Africa 5th ODI Rohit Sharma,Rohit Sharma,MS Dhoni,Virat Kohli,AB de Villiers,Mumbai series decider 5th ODI, Gandhi-Mandela Series 2015 India India vs South Africa India vs South Africa 2015 South Africa South Africa tour of India 2015 South Africa vs India South Africa vs India 2015

India will seek to keep the momentum when they go into what promises to be a thrilling series decider against South Africa.

పంతం మీదా, మాదా హై.. సోంతం మీకా.. మాకా.. హై

Posted: 10/24/2015 05:22 PM IST
India vs south africa 2015 5th odi at mumbai series set for high voltage finale

దక్షిణాఫ్రికాతో ముంబై వేదికగా వాంఖేడ్ స్టేడియంలో రేపు జరగనున్న తుది మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతుంది. ఇరు జట్ట మద్య పంతం నీదా నాదా హై.. వన్డే టైటిల్ సోంతం నీదా నాదా అంటూ సాగనుంది. దీంతో అభిమానుల మధ్య కూడా తుది వన్డే వెయ్యి వోల్జేజీల ధ్రిలర్ గా కొనసాగనుంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇరు జట్టు చెరో రెండు మ్యాచ్ లను ెలుపోంది సమవుజ్జీలుగా వున్నాయి. దీంతో తుది మ్యాచ్ పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్పై పైచేయి సాధించేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతుంది.

మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా గత వన్డేలో ఫలితాన్నే పునరావృతం చేసి సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుని మరోసారి టీమిండియాకు షాకివ్వాలని చూస్తోంది. ఇప్పటికే తీవ్ర ప్రాక్టీస్ లో నిమగ్నమైన రెండు జట్లు వ్యూహ-ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండో, నాల్గో వన్డేలో బ్యాట్స్ మెన్ వైఫల్యంతో డీలా పడిన సఫారీలు..ఆ తప్పును చివరి వన్డేలో మళ్లీ చేయకుండా సమష్టిగా పోరాడాలని యోచిస్తోంది.  

అటు విరాట్ కోహ్లి, సురైష్ రైనా ఫామ్ లోకి రావడంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతుండగా, ఇటు దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ ఏబీ డివిలియర్స్ , డీ కాక్ ల మినహా మిగతా వారు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా, డేవిడ్ మిల్లర్, డు ప్లెసిస్ లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో కాస్త డైలామాలో ఉన్న డివిలియర్స్ సేన దాన్ని అధిగమించాలని కసరత్తులు చేస్తోంది. సిరీస్ ను ధోని సేన సాధిస్తుందా? లేక సిరీస్ ను సమర్పిస్తుందా?అనేది వేచిచూడక తప్పదు.. ఇక ధోనీ కెప్టెన్సీపై కత్తివేలాడుతోంది. ఈ సిరీస్ ఓడిపోతే ధోనీపై ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖేడ్ స్టేడింయంలో జరిగే వన్డే గెలవాలంటే ధోనీసేన సమష్టిగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు సఫారీలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమరోత్సాహంతో ఉన్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Ind vs SA  mumbai  South Africa  cricket  India vs South Africa 4th ODI  

Other Articles