BCCI probe on Cricketer Amit Mishra in assaulting female friend

Bcci orders probe on amit mishra in sexual assault case

amit mishra, cricketer, sexually assault, leg spinner, amit mishra booked, amit mishra case, amit mishra news, bengaluru, Bengaluru police registered fir against amit mishra, criminal case against Amit Mishra, amit mishra sexual assault case, amit mishra assault case, amit mishra assaulting female friend, amit mishr five star assault case

Indian cricketer Amit Mishra was summoned by Bengaluru police on 20 October for allegedly physically assaulting and abusing a woman in his hotel room in the city.

టీమిండియా క్రికెటర్ పై విచారణకు అదేశించిన బిసీసీఐ

Posted: 10/21/2015 07:12 PM IST
Bcci orders probe on amit mishra in sexual assault case

టీమిండియా క్రికెటర్,  లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా  దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో వన్డేలో ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. అమిత్ మిశ్రా తనను లైంగికంగా వేధించినట్లు అతనికి పరిచయమున్న ఓ మహిళ అరోపించడంతో కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పోలీసులు అమిత్ మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పంపించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీసీసీఐ.. బౌలర్ మిశ్రాపై విచారణకు బుధవారం ఆదేశించింది.

దీంతో టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న గాంధీ-మండేలా సిరీస్లో గురువారం జరగనున్న నాల్గో వన్డేలో మిశ్రా ఆడుతాడా లేదా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా, బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించిన బెంగళూరు పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేశారు. కాగా,  ఈ కేసు విషయమై ఇప్పటివరకు అమిత్ మిశ్రా కానీ అతని కుటుంబికులు కానీ స్పందించలేదు. బెంగళూరులో గత నెలలో భారత జట్టు శిక్షణా శిబిరం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Mishra  Sandeep Pati  sexual assault  bengaluru  female friend  

Other Articles