Ranji Trophy: Yuvraj Singh of past returns, scores massive century and steers Punjab ahead of Gujarat

Yuvraj singh produces vintage knock hits 187 in ranji match

Ranji Trophy, Cricket, Yuvraj Singh, Manan Vohra, Mandeep Singh, Rujul Bhatt, Siddarth Kaul, Uday Kaul, Punjab, Gujarat, Zaheer khan, latest Cricket news

Yuvraj Singh continued from where he had left on Saturday to register his 24th first class ton in a Ranji Trophy group game between Punjab and Gujarat on Sunday

రంజీ మ్యాచ్ లో.. ఫామ్ లోకి తిరిగోచ్చిన యువరాజ్..

Posted: 10/18/2015 07:06 PM IST
Yuvraj singh produces vintage knock hits 187 in ranji match

2011లో జరిగిన ప్రపంచ కప్ వన్డే క్రికెట్ టోర్నమెంటులో ఛాంపియన్ షిప్ గా టీమిండియా అవతరించడానికి ఒక కారణమైన టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ మళ్లీ ఫాప్ లోకి వచ్చాడు. రంజీట్రోఫీలో సత్తా చాటాడు. గ్రూపు 'బి' లీగ్ లో గుజరాత్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఈ పంజాబ్ బ్యాట్స్ మన్ సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. సిక్సర్ తో సెంచరీ పూర్తి చేయడం విశేషం.  233 బంతుల్లో 187  పరుగులు చేసి అవుటయ్యాడు. పంజాబ్ 608 పరుగులకు ఆలౌటైంది.  గుజరాత్ పై పంజాబ్ కు 141 పరుగుల ఆధిక్యం దక్కింది.

మనన్ వోహ్రా(104)  సెంచరీకి తోడు మనదీప్ సింగ్(63), కౌల్(74) అర్ధ సెంచరీలతో రాణించడంతో పంజాబ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 467 పరుగులు చేసింది.రానున్న ప్రపంచకప్ టీ20 ఛాంపియన్ షిప్ లో టీమిండియా జట్టులోకి రావాలని తన అశాభావాన్ని ఇటీవలే వ్యక్తం చేసిన యువరాజ్ అంతలోనే ఫామ్ లోకి రావడం ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. యువరాజ్ ఇలాగే ఫామ్ లో కంటిన్యూ అయితే టీమిండియా తుది జట్టులోకి రావడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  punjab cricket team  ranji trophy  

Other Articles