Team Indias new middle order Ajinkya Rahane 3 Virat Kohli 4

Team indias new middle order ajinkya rahane 3 virat kohli 4

ajinkya rahane, ajinkya rahane ms dhoni, ms dhoni ajinkya rahane, ms dhoni, Team India, new middle order, Virat Kohli, ajinkya rahane batting order, virat kohli batting order, rahane kohli batting order, odi games, world cup, sports news

MS Dhoni says Ajinkya Rahane bats with lot more freedom against spin once he is settles in after facing the seamers.

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో మార్పులు..

Posted: 10/17/2015 07:38 PM IST
Team indias new middle order ajinkya rahane 3 virat kohli 4

అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. సౌత్ అఫ్రికాతో జరుగనున్న మూడో వన్డేలో కొత్త మిడిల్ ఆర్డర్ తెరపైకి రానుంది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ ధోని సూచనప్రాయంగా తెలిపాడు. ఇకపై జరగనున్న అన్ని వన్డే మ్యాచులలో ఈ మార్పులు వుంటాయన్నాడు. టీమిండియా వన్డే జట్టు మిడిల్ ఆర్డర్ లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపాడు. నెంబర్ మూడు స్థానంలో గత కొంత కాలంగా బ్యాటింగ్ కు దిగుతున్న విరాట్ కోహ్లీని ఆ స్థానం నుంచి మార్చి.. అజింక్య రహానే ను ఆ స్థానంలో పంపుతున్నట్లు చెప్పాడు. పేస్ బౌలర్లను ఎదుర్కోన్న తరువాత స్పిన్ బౌలర్లను రహానే ధీటుగా ఎదుర్కోని, ధాటిగా పరుగులు సాధించడమే కారణంగా చెప్పుకోచ్చాడు.

కాగా ప్రస్తుత టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ నెంబర్ త్రి స్థానం నుంచి మార్చవద్దని కూడా పలువురు సూచిస్తున్నారు. ఈ స్థానంలో కొనసాగుతూ కోహ్లీ అనేక పరుగులను రికార్డులను సాధించాడని, ఆయను నెంబర్ త్రి స్థానం నుంచి మార్చితే ఆయన ఆటపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వాదిస్తున్నారు. అయితే మరికోందరు మాత్రం ప్రస్తుతం అజింక్య రహానే నెంబర్ త్రి స్థానానికి సూట్ అవుతాడని పేర్కోంటన్న తరుణంలో ధోని తన నిర్ణయాన్ని సూచన ప్రాయంగా తెలిపాడు. ధోని అనుకున్నవన్నీ అనుకునట్లుగా జరిగితే రానున్న వన్డే మ్యాచ్ నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajinkya rahane  ms dhoni  Team India  new middle order  Virat Kohli  

Other Articles