Subramanian Swamy moves HC against CSK, RR suspension

Subramanian swamy moves hc against csk rr suspension

BJP leader Subramanian Swamy, Indian Premier league, IPL, Raj kundra, N srinivasan, Gurunath meiyappan, betting on ipl, suspension of CSK and RR, multi-million dollar tournament, Madras High Court, Chennai Super Kings, Rajasthan Royals, india news, latest news, breaking news

BJP leader Subramanian Swamy came to the rescue of beleaguered IPL outfits Chennai Super Kings and Rajasthan Royals (RR) challenging their suspension from the multi-million dollar tournament in the Madras High Court..

ఆ రెండు జట్లపై నిషేధాన్ని ఎత్తివేయండి

Posted: 09/22/2015 06:40 PM IST
Subramanian swamy moves hc against csk rr suspension

బిసిసిఐ పాలిట కాసుల వర్షం కురిపిస్తున్న వందల మిలియన్ల టోర్నమెంటుగా ప్రఖ్యాతి చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుంచి ఆ రెండు జట్లను నిషేధించడం సబబు కాదని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని సిరీస్ లలో ఆడిన ఈ జట్లను నిషేధించడం సమంజసం కాదని, సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును ఆయన సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ లోథా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపైన నిషేధం వేటు వేయడాన్ని  సుబ్రహ్మణ్య స్వామి మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తద్వారా ఆయన చెన్నై, రాజస్థాన్ జట్లను బెయిలవుట్ చేసేందుకు పూనుకున్నారు. విచారణ ప్రక్రియను ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ప్రభావితం చేశారని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కారణంగానే చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీల పైన చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోథా కమిటీ తీర్పును నిలుపుదల చేయాలని ఆయన హైకోర్టును కోరారు. అలాగే, లోథా కమిటీ తీర్పును కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం.. చెన్నై ఫ్రాంచైజీ వేసిన పిటిషన్‌తో కలిసి రేపు విచారణ చేపట్టనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  IPL  suspension of CSK and RR  Madras High Court  

Other Articles