దాయాధి దేశాల మధ్య జరగనున్న క్రికెట్ సిరీస్ టెస్టు సిరీస్ ఖ్యాతని, గౌరవాన్ని మరింత పెంపోందిస్తుందని అంతర్జీతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యనిర్వహాణాధికారి డేవ్ రిచ్చర్డ్ సన్ అశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య భద్రత, రక్షణ ఇత్యాది ఒప్పందాలు కుదుర్చుకున్న పిమ్మట ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అంగీకారం, అమోదం మేరకు జరగనున్న టెస్టు సీరిస్ క్రికెట్ గౌరవాన్ని మరింత పెంచడంతో పాటు.. ఆట దిశగా యువతరాన్ని ప్రోత్సహిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కుదుర్చుకున్న ఓప్పందాల మేరకు ఇండియా పాకిస్థాన్ ల మధ్య రెండు టెస్టు సిరీస్ లను కుదర్చుకున్నట్లు సమాచారం.
అదీ కాకుండా గత ఏడాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సభ్యులు భేటీ అయ్యి. 2023 వరకు ఆరు సిరీస్ లను ఆడాలని ఎం ఓ యు ఒప్పందాలు చేసుకున్నారు. యూఏఈలో పాకిస్థాన్ తో ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లతో పాటు ఒక టీ20ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన ఈ విషయమై స్పందించారు. అన్ని అంగీకారాలు పూర్తి చేసుకున్న తరువాత రెండు దాయాధి దేశాల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ ఒక ఐకానిక్ సిరీస్ గా నిలుచిపోతుదని చెప్పారు. ఈ సిరీస్ ఖరారైతే చాలు.. దానికి మునుపెన్నడూ...ఏ సిరీస్ కు రానంత ప్రచారం వస్తుందని, ఆ ప్రచారం రెండు దేశాల్లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. ఈ సిరీస్ ను వీక్షించేందుకు గతంలో ఎన్నడూ లేనంత మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షిస్తారని రిచర్డ్ సన్ అభిప్రాయపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more