Brad Haddin calls curtains on international cricket

Australia s brad haddin retires from international cricket

Australia, England, Brad Haddin calls curtains on international cricket, Australia's Brad Haddin retires from international cricket, news, Australia, Brad Haddin, retire, international Test cricket, India news, latest cricket news

Haddin becomes latest member of conquered Ashes squad to say goodbye to the national team

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన హాడిన్

Posted: 09/09/2015 06:38 PM IST
Australia s brad haddin retires from international cricket

ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ కాలం పాటు జట్టును అంటిపెట్టుకుని ప్రపంచ కప్ సాధించి జట్టు విశ్వవిజేతగా నిలవడంతో దోహదపడిన 37 ఏళ్ల హాడిన్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వైదొలగుతున్న్టట్టు బుధవారం ప్రకటించాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున టి20లు మాత్రమే ఆడతానని వెల్లడించాడు. గత మే నెలలోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు  గుడ్ బై చెప్పిన ఆయన మూడు నెలల తరువాత టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

 'లార్డ్స్ నుంచి తిరిగివచ్చాక రియల్ లైజ్ అయ్యాను. బ్యాట్స్ మన్ గా పరుగులు చేయడం నా బాధ్యత. కానీ యాషెన్ సిరీస్ లో విఫలమయ్యాను. ఫలితంగా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా' అని హాడిన్ తెలిపాడు. 66 టెస్టులు ఆడిన హాడిన్ కు గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత 30 ఏళ్ల వయసులో తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. టెస్టుల్లో అతడు 270 వికెట్లు పడగొట్టాడు. 32.98 సగటుతో 3266 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు,18 అర్ధసెంచరీలు ఉన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Brad Haddin  retire  international Test cricket  

Other Articles