Angelo Mathews Makes Controversial Comments On Indian Cricketers | Sachin Tendulkar | Rahul Dravid

Angelo mathews controversial comments on indian cricketers

Angelo Mathews news, Angelo Mathews controversy, india cricketers, team india cricketers, sachin tendulkar, rahul dravid, spinners

Angelo Mathews Controversial Comments On Indian Cricketers : Angelo Mathews Makes Controversial Comments On Indian Cricketers.

భారత ఆటగాళ్లు అంత పోటుగాళ్లు కాదట!

Posted: 08/19/2015 04:10 PM IST
Angelo mathews controversial comments on indian cricketers

టీమిండియా ప్రస్తుత జట్టు గతకొన్నాళ్ల నుంచి పేలవ ప్రదర్శనతో వరుసగా ఓటమి పాలవుతూ వస్తోంది. ఇందుకు కారణం ప్రతిభ గల సీనియర్ ఆటగాళ్లు లేకపోవడమే ప్రధానమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే.. వరల్డ్ కప్ కంటే ముందునుంచి ఇండియాకి ‘ఓటమి’ అనే పదం నీడలా వెంటాడుతూ వస్తోంది. అదృష్టవశాత్తూ ఇండియా వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ దాక చేరుకుందే కానీ.. దానికంత సీన్ లేదంటూ ఆమధ్య కొందరు పెదవి విరిచిన సందర్భాలూ వున్నాయి.

నిజానికి జట్టులో అద్భుత ఆటగాళ్లు వున్నప్పటికీ వారు తమ ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నారు. సొంతగడ్డలో తూతూమంత్రంగా రాణిస్తున్నారేగానీ.. విదేశాల్లో మాత్రం తోక ముడిచేస్తున్నారు. కాలక్రమంలో వారిలో మార్పు వచ్చి తిరిగి ఫామ్ లోకొస్తారని భావించినప్పటికీ.. ఎటువంటి ఫలితమూ లేకపోయింది. ముందుకంటే ఇప్పుడు వీరి పరిస్థితి మరీ హీనంగా మారిపోయింది. దాంతో టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది దిగ్గజాలు భారత ఆటగాళ్లను తమ మాటల తూటాలతో గాయపరచగా.. తాజాగా శ్రీలంక సారథి ఏంజెలా మాథ్యూస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడున్న భారత బ్యాట్స్ మెన్లు అంత పోటుగాళ్లేమీ కాదంటూ తేల్చి పడేశాడు.

ఇప్పుడున్న భారత బ్యాట్స్ మెన్లను సచిన్లు, ద్రావిడ్లు కారని.. స్పిన్ ఆడడంలో వారికి పరిమితులున్నాయని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. స్పిన్ ఆడే విషయంలో దిగ్గజాలతో వారిని పోల్చలేమని పేర్కొన్నాడు. అయితే, స్పిన్నర్లను ఎలా ఆడాలో భారత బ్యాట్స్ మెన్ నిలకడ మీద నేర్చుకుంటారని కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. ప్రస్తుత భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడినీ సచిన్, ద్రావిడ్ తో పోల్చలేమని అన్నాడు. భారత యువ బ్యాట్స్ మెన్ ను సచిన్, ద్రావిడ్ తో పోల్చడమంటే, లంక జట్టులోని కుర్రాళ్లను మహేల, సంగక్కరలతో పోల్చినట్టుంటుందని మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelo Mathews  sachin tendulkar  team india cricketers  

Other Articles