Rayudu-led India A look for improved performance against South Africa A

Ramela pushes visitors ahead after axar strikes

Cricket,India,South Africa,Live Cricket Score,Live Score India A vs South Africa A First 'Test', Live Cricket Score: Ramela Pushes Visitors Ahead After Axar Strikes latest Cricket news

The new-look Ambati Rayudu-led India A take fresh guard against beleaguered South Africa A in the first of two-match unofficial Test series

సఫారీల వికెట్ల కోసం చమటోడుస్తున్న రాయుడి సేన..

Posted: 08/18/2015 06:36 PM IST
Ramela pushes visitors ahead after axar strikes

టీమిండియా తరుపున వన్డే ఆటగాడిగా ఆడుతున్న అంబలి రాయుడు అటు తన సత్తా చాటుకుని టెస్టు జట్టులోకి కూడా ప్రవేశించేందుకు సన్నధమవుతున్నాడు. ఆయన నేతృత్వంలో టీమీండియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌లో భాగంగా కేరళలోని వాయనాడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఇరు జట్టు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. వాయనాడ్ జిల్లాలోని కృష్ణగిరిలో కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) సొంతంగా నిర్మించుకున్న స్టేడియంలో జరుగుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇదే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అతిధ్య జట్టు దక్షిణాప్రికా.. నిలకడగా రాణిస్తుంది. తొలిరోజున మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా పలుమార్లు మ్యాచ్ కు అంతరాయం కలిగింది. భారత్ స్పిన్ర్ అక్సర్ పటేల్ స్పిన్  మాయాజాలం కూడా సఫారీల ముందు వెలవెలబోయింది. అతిధ్య జట్టు సభ్యులు నిలకడగా ఆగుతూ.. స్కోరుబోర్డును పరుగులెత్తంచారు. ఓపెనర్లు హెండ్రిక్స్, వాన్ జెల్ నెమ్మదిగా బాగస్వామ్యం నెలకొల్పతున్న సమయంలో 60 పరుగుల వద్ద తొలి విక్కెట్ దక్కింది.  ఆ రువాత 100 పరుగులు స్కోరు వద్ద భారత్ ఖు మరో విక్కెట్ అభించింది. అర్థశతకం సాధించిన హెండ్రిక్స్ 50 పరుగలు వ్యక్తగత స్కోరువద్ద అవుట్ అయ్యాడు ఆ తరువాత 157 పరుగులకు అక్షర్ పటేల్ బౌలింగ్ లో డీ బ్రున్ పెవీలియన్ దారి పట్టాడు. రెండో రోజు భారత బౌలర్లు సత్తా చాటకపోతే భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా ఏ జట్టు దూసుకుపోవడం ఖాయమని తెలుస్తోంది.

భారత జట్టు వివరాలు:  అంబటి రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, బైన్స్, శ్రేయస్ అయ్యర్, బాబా అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, మిథున్, శార్దుల్, ఈశ్వర్ పాండే, జాక్సన్, జీవన్‌జోత్ సింగ్
దక్షిణాఫ్రికా జట్టు వివరాలు: విలాస్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, బవుమా, క్లోట్, డి బ్రూన్, డి లాంజ్, రీజా హెం డ్రిక్స్, కేశవ్ మహరాజ్, ప్యాటర్సన్, పీడ్, రమేలా, సోట్సోబ్, వాన్ జిల్, విల్‌జోన్, వీస్, డి కాక్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  India A  south africa A  Ambati Rayudu  

Other Articles