India vs SL Galle Test Day 3: Dinesh Chandimal's superb 162 guides Sri Lanka to 367

Galle test chandimal 162 leaves india tricky chase

Captaincy, Cricket, Galle, India, India in Sri Lanka 2015, Murali Vijay, Sports, Sri Lanka, Virat Kohli, Ravichandran ashwin, amit mishra, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, India vs srilanka, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, Test Cricket Live, Virat Kohli, Ajinkya Rahane, Angelo Mathews, Kumar Sangakkara, Galle, cricket news

India 375 and 23 for 1 (Herath 1-13) need another 153 for beat Sri Lanka 183 and 367

చండీమాల్ అజేయ శతకం.. ఇన్నింగ్స్ విన్ చేజార్చుకున్న కోహ్లీ సేన

Posted: 08/14/2015 06:30 PM IST
Galle test chandimal 162 leaves india tricky chase

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఒంటి చేత్తో పోరాటం చేసిన వీరుడు దినేష్ చండిమాల్. లంక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే అలౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్ లో చండీమాల్ అద్భుత 162 పరుగులతో లంక 367 పరుగుల చేసి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి లంక 367 పరుగల వద్ద ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ అఢిన భారత్ విక్కట్ నష్టానికి 23 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ ఇంకా 153 పరుగులను సాధించాల్సి వుంది.

తొలి ఇన్నింగ్స్ లో అంతగా రాణించలేకపోయినా.. నిరాశ చెందక ఆటపై పట్టుబిగించి.. అజేయ శతకంతో రాణించిన చండీమాల్ లంకను ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో లంక 367 పరుగులకు ఆలౌట్ అయినా.. చండీమాల్ మాత్రం అజేయంగానే నిలుచున్నాడు. ఆయన వీరోచిత పోరాటం ముందు భారత్ స్పిన్ మాయాజాలం కూడా పనిచేయలేదు. కోహ్లీ సేనను రెండో ఇన్నింగ్స్ ఆడేవిధంగా చేసిన చండీమాల్ 169 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 162 పరుగులతో బారత బౌలర్లపై వీరవిహారం చేశాడు. చనిమాల్ బ్యాటింగ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ను గుర్తుకు తీసుకువచ్చిందని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించడం విశేషం.  

ఇటు లంకను కట్టడి చేయడంలో స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ప్రయత్నాలు ఫలించాయి. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగోట్టిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లను సాధించాడు. అమిత్ మిశ్రాకు రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు దక్కగా, హర్భజన్ సింగ్ కు ఒక్క విక్కెట్ వరుణ్ అరోన్, ఇషాంత్ శర్మకు చెరో వికెట్ లభించింది. మరో రెండు రోజలు అట మిగిలివుండటంతో కోహ్లీ సేన సునాయాసంగానే మ్యాచ్ ను గెలుచేందుకు కదనరంగంలోకి దిగింది. రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ తన సత్తాను చాటడంలో మరోమారు విఫలమయ్యాడు. రంగనా హెరత్ బౌలింగ్ లో ఆయన ఐదు పరుగులు వ్యక్తిగత స్కోరుతో వెనుదిరిగాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శిఖర్ ధావన్ 13 పరుగులో, ఇషాంత్ శర్మ ఐదు పరుగులతో క్రీజ్ లో వున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashwin  amit mishra  chanimal  srilanka  India  ind vs sri  india vs srilanka 2015  

Other Articles