Wasim Akram's Car Attacked in Karachi, Speedster Unhurt

Wasim akram narrowly escapes attack in karachi

Wasim Akram, Cricket, Wasim Akram's Car Attacked in Karachi, Speedster Unhurt, latest Cricket news, pakistan cricket, former captain Wasim Akram, bowling assignment with Pakistan Cricket Board, National Stadium at karachi, car hit from rare side, fire from another car, government officials car, registration plate number

Former captain Pakistan cricket team Wasim Akram escaped an assassination attempt when unidentified assailants opened fire at his car on Shah Faisal road near Karsaaz in Karachi.

కరాచీలో వసీం అక్రమ్ పై కాల్పులు.. తృటిలో తప్పించుకున్న పేసర్..

Posted: 08/05/2015 06:35 PM IST
Wasim akram narrowly escapes attack in karachi

పాకిస్థాన్ కరాచీలో మరోమారు క్రికెట్ క్రీడాకారుడిపై కాల్పుల కలకలం రేపాయి. శ్రీలంక క్రికెట్ జట్టుపై గతంలో ఆరేళ్ కిందట జరిగిన కాల్పుల తరువాత.. తమ సొంత దేశానికి చెందిన క్రికెటర్లపై కాల్పులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారధి వసిమ్ అక్రమ్ పై గుర్తు తెలియని అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోగలిగారు. ఆయన కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.

కాల్పుల ఘటన తరువాత మీడియాతో మాట్లాడిన వసీమ్ అక్రమ్ తనపై గుర్తు తెలియని అగంతకులు కాల్పులు జరిపారని చెప్పారు. తన నివాసం నుంచి పాకిస్థాన్ రాజధాని కరాచీలో వున్న నేషనల్ క్రికెట్ స్టేడియానికి వస్తున్న మార్గంలో షా ఫైసల్ రోడ్డలో కర్సాజ్ వద్ద తన కారును వెనకగా వచ్చిన మరో కారు డీ కోనిందని చెప్పారు. కాగా అటుగా వచ్చిన మారో కారులోంచి అగంతకుడు తనపై కాల్పులకు తెగబడ్డాడని చెప్పాడు. అయితే కాల్పుల ఘటనను నుంచి తృటిలో తప్పించుకున్న నని అక్రమ్ తెలిపాడు.

తనపై కాల్పులకు తెగబడిన వ్యక్తి ప్రభుత్వ అధికారి మాదిరిగా వున్నాడని, అతను అందుకు వినయోగించింది కూడా ప్రభుత్వానికి చెందిన కారునేనని వసీం అక్రమ్ తెలిపాడు. కారు రిజిస్ట్రేషన్ నెంబరు సహా అన్ని వివరాలను తాను పోలీసుకులకు చెప్పినట్లు తెలిపారు. పాకిస్థాన్ కు  చెందిన యువ క్రికెటర్లకు తాను బౌలింగ్ లోని మెళకువలు తెలిపేందుకు గాను 13 రోజుల పాటు క్యాంప్ ను నిర్వహించేందుకు వసీహ అక్రమ్ తో ఇటీవలే పాకిస్థాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని జీర్ణించుకోలేని వారే ఈ దాడికి పాల్పడి వుంటారని అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wasim Akram  Cricket  national stadium  karachi  

Other Articles