Dale Steyn: South Africa bowler fastest to 400 Test wickets

Dale steyn joins 400 test wicket club

Bangladesh, South Africa, Tamim Iqbal, Dale Steyn, Cricket, Dale Steyn Joins 400 Test Wicket Club, 400 Test wicket club, second South African bowler, 400 Test wickets, Shaun Pollock, first South African bowler, 80th Test, South African skipper Hashim Amla, India spinner Harbhajan Singh, England paceman James Anderson, latest Cricket news

Dale Steyn reached his landmark when South African skipper Hashim Amla took a chest-high catch at first slip to dismiss Bangladesh opener Tamim Iqbal on the first day of the second and final Test.

400 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన రెండో బౌలర్

Posted: 07/30/2015 07:26 PM IST
Dale steyn joins 400 test wicket club

ఆ బౌలర్ ను చూస్తే అందరూ బ్యాట్స్ మెన్ల ఒకింత జంకుతారు. అతని తొలి ఓవర్లలో పరుగులు నిదానంగానూ రాబట్టకునేందుకు యోచిస్తారు. ఇంతకీ ఎవరా బౌలర్ అంటారా..? ఆయనే. దక్షిణాఫ్రికా కు చెందిన టాప్ బౌలర్ డెల్ స్టెయిన్. ఇప్పుడు ఆయన మరో ఘనత కూడా సాధించారు. అదే నాలుగు వందల వికెట్ల క్లబ్ లో చేరడం. టెస్టుల్లో ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 13వ బౌలర్ గా నిలిచిన స్టేయిన్.. దక్షిణాప్రికా దేశానికి తరపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా కూడా రికార్డుల నెలకొల్పాడు.

గతంలో దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పోలాక్ 421 వికెట్లను తీసుకుని ఈ రికార్డును నెలకొల్పగా, స్టెయిన్ ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టు తొలి రోజున ఈ ఫీటును సాదించాడు. 12 పరుగుల వద్ద ఓపెనర్ తమీమ్ ఇక్బాల్.. స్టెయిన్ వేసిన బంతిని ఎదుర్కోని పస్ట్ స్లిప్ లో వున్న సఫారీల కెప్టెన్ అమ్లాకు క్యాచ్ ఇచ్చాడు. ఛాతి ఎత్తులో దూసుకువచ్చిన బంతిని అమ్లా చక్కని క్యాచ్ అందుకోవడంతో తమీమ్ ఇక్బాల్ వికెట్ స్టెయిన్ కు లభించింది. దీంతో ఈ స్టేయిన్ 400 వికెట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం క్రికెట్ లో కోనసాగుతున్న బౌలర్లలో ఇండియా తరుఫున హర్భజన్ సింగ్, ఇంగ్లాండ్ తరపున అండర్సన్, సహా డెల్ స్టీయిన్ ఈ అరుధైన ఫీట్ ను సాధించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  South Africa  Dale Steyn  400 Test wicket club  Cricket  

Other Articles