Trial court discharges Sreesanth and 15 others from ipl spot fixing case

Will play cricket by gods grace says sreesanth

IPL spot fixing, IPL betting, 16 indian cricketers, sreesanth, delhi high court, IPL 2013 spot-fixing, Patiala House Court, Board of Control for Cricket in India (BCCI), lack of evidence, Sreesanth, No regrets, no complains, god-willing, latest Cricket news, IPL 2013, Spot fixing, S Sreesanth, Ajit Chandila, Ankeet Chavan, IPL spot fixing, Cricket, Court order

S. Sreesanth Discharged in Indian Premier League 2013 Spot-Fixing Case by Patiala House Court

ఫిట్ నెస్ సాధించి, మళ్లీ క్రికెట్ అడుతా..

Posted: 07/25/2015 06:34 PM IST
Will play cricket by gods grace says sreesanth

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ లోని పాటియాల కోర్టు నుంచి నిర్దోషిగా విడుదలైన భారత పేసర్, కేరళ వాసి శ్రీశాంత్ ఫిట్ నెస్ సాధించి మళ్లీ క్రికెట్ ఆడుతానని ధీమా వ్యక్తం చేశారు. కోర్టు తనను నిర్దోషిగా విడుదల చేయడంపై తన స్పందనను తెలియజేస్తూ.. ఆనందం పట్టలేక కళ్లు చమర్చాడు. ఆనందబాష్పాలను రాల్చాడు. అనంతరం మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను ఎవరినీ క్షమాపణలు చెప్పలేనని, అలాగే ఎవరికి ధన్యవాదాలు కూడా చెప్పుకునే అవసరం లేదన్నారు. అలాగే ఎవరిపైనా విమర్శలు, పిర్యాదులు చేయదలుచుకోలేదని చెప్పుకోచ్చారు. అయితే దేశ ప్రజల నమ్మకాన్ని చూరగోనాల్సిన అవసరముందని చెప్పారు. తనతో పాటు కేసులో చిక్కకున్న 16 మంది క్రికెటర్లకు ఊరటనిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

రెండేళ్ల క్రితం ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్ సహా పలువురిని అరెస్ట్ చేయగా, దానిని అసరాగా చేసుకుని క్రమశిక్షఃణ కింద చర్యలు తీసుకున్న బిసిసిఐ శ్రీశాంత్ పై దేశీయ, జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆటలలో పాల్గోనకూడాదని జీవిత కాలం నిషేధాన్ని విధించింది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో బిసిసిఐ అనుమతి తీసుకుని మరోమారు క్రికెట్ లో రాణించి దేశ ప్రజల విశ్వాసాన్ని పోందుతానన్నారు. దేవుడి దయ వల్ల మళ్లీ క్రికెట్ అడుతానని చెప్పాడు. తాను నిర్దోషిగా విడుదలైన విషయం విని తన కూతురు సంతోషిస్తుందని శ్రీశాంత్ అన్నాడు. తనకు అండగా నిలిచిన భార్య, కూతరు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తలిపాడు. తనకు సినిమా రంగంలో అవకాశాలు వచ్చిన క్రికెట్ తన తోలి ప్రాధాన్యంగా చెప్పుకోచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL spot fixing  IPL betting  sreesanth  delhi court  

Other Articles