MCC calls for Olympics cricket and 12-team World Cup

Icc should push for olympic spot says mcc

Marylebone Cricket Club, World Cricket Committee, MCC World Cricket Committee members, Sourav Ganguly, Ricky Ponting, Ramiz Raja, Rahul Dravid, retrograde step, ICC Cricket World Cup, Steve Bucknor

The MCC World Cricket Committee feels the ICC's decision to limit the ODI World Cup to 10 teams is a 'retrograde step' and detrimental to the sport's chances of finding a place in the Olympics.

ఒలంపిక్స్ లోకి క్రికెట్..? పది జట్టే చాలు

Posted: 07/15/2015 06:45 PM IST
Icc should push for olympic spot says mcc

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ప్రతిష్టాత్మక క్రికెట్ ప్రపంచ కప్ టార్నమెంటులో కేవలం  అత్యుత్తమ జట్లకు మాత్రమే స్థానం కల్పించాలన్ని ప్రతిపాదనను మరిల్ బోన్ క్రికెట్ క్లబ్ తోసిపుచ్చింది. ఈ రకంగా కేవలం పది జట్లను మాత్రమే ప్రోత్సహించిన పక్షంలో క్రికెట్ ఆట మరోమారు పూర్వ దశకు చేరుకుంటుందని ఎంసీసీ క్రికెట్ కమిటీ అభిప్రాయపడింది. ఇది క్రికెట్ క్రీడ ఉనికికే హానికరమని పేర్కోంది. ఒలంపిక్స్ లో స్థానం కోసం ఐసిసి ఆసక్తిని కనబర్చాలని పేర్కోంది. గత రెండు రోజులుగా భేటీ అయిన ఎంసిసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఎంసీసీ క్రికెట్ కమిటీ నూతన సభ్యులుగా ఎంపికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి, అస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ రమీజ్ రజాలు.. ఇప్పటి వరకు సదరు పదవులలో సభ్యులుగా కోనసాగిని స్టీవ్ బక్ నర్, రాహుల్ ద్రావిడ్ లకు వీడ్కొలు తెలిపే సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా నూతన క్రికెట్ కమిటీ సభ్యలు ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో 12 జట్లతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 2019, 2023 ప్రపంచ కప్ టోర్నమెంటులలో పది జట్టతోనే అడాలన్న నిర్ణయం హానికరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇక ఒలంపిక్స్ లో స్థానం కోసం ఐసిసి పాటుపడితే.. క్రికెట్ క్రీడ విశ్వవ్యాప్తం కావడానికి, ప్రపంచ నలుమూల నుంచి అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభించడానికి ఇది దోహపడుతుందన్నారు. ఐసీసీలోని అన్ని సభ్య దేశాల బోర్డులు కూడ అందుకు మద్దతు తెలపాలని సూచించింది. ప్రస్తుతం క్రికెట్ లో అతి పోట్టి ఫార్మెట్ గా వున్న ట్వంటీ 20 పార్మెట్ ను ఒలంపిక్స్ లో ఆడేందుకు వీలుగా వుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు సమావేశానంతరం ఎంసీసీ క్రికెట్ నూతన కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles