ShameOnBangladesh: Bangladeshi newspaper makes fun of Indian Cricket Team with a distasteful ad

Bangladeshi newspaper tries to shame indian cricket with its controversial ad

Bangladesh thrashed India, three match ODI series, Indian cricket players, Ajinkya Rahane, Rohit Sharma, Virat Kohli, Ravindra Jadeja, MS Dhoni, Shikhar Dhawan, Ravichandran Ashwin, half-bald, distasteful ad, Controversial Ad, Bangladesh, Murtafiz Cutter, offcutters, Tiger Stationery, Made in Bangladesh, Stadium Market, Mirpur, Dhaka., outrage, verbal spat, two nations, social media

After Bangladesh thrashed India in the three match ODI series, one of their media tried to take a dig at the Indian players with a distasteful ad.

బంగ్లా దురహంకారానికి పరాకాష్ట..ధోనిసేనను పరాభవిస్తూ ప్రకటన

Posted: 06/30/2015 08:00 PM IST
Bangladeshi newspaper tries to shame indian cricket with its controversial ad

బంగ్లాదేశ్ మీడియా దురంహాకారినికి ఇది పరాకాష్ట. అత్యంత చిన్న సిరీస్ లో టీమిండియాపై పైచేసి సాధించిన బంగ్లాదేశ్ గోప్పతనాన్ని భారత్ మీడియా వేనోళ్ల శ్లాఘిస్తున్న క్రమంలో.. బంగ్లాదేశ్ మీడియా మాత్రం తద్విరుద్దంగా వ్యవహరిం,చింది. టీమిండియా ఆటగాళ్లను, దోని సేనను అవమానపర్చేవిధంగా అతి హేయకరమైన ప్రకటనలను ప్రచురించింది. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలుపోందడంతెనే అక్కడి ఆటగాళ్లను భుజానికి ఎత్తుకుని ప్రకటనలు గుప్పిస్తే.. పర్వాలేదు కానీ, ఓటమి పాలైన వారిని టార్గెట్ చేసి వారిని కించపర్చే విధంగా ప్రకటనలు ఇవ్వడంతో అదికాస్తా వివాదాస్పద అంశంగా మారింది.

వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో అంఫైర్ల తప్పిదాల కారణంగానే టీమిండియా బంగ్లాదేశ్ పై గెలించిందని విరుచుకుపడ్డ ఆక్కడి మీడయా తాజాగా టీమిండియాను కించపర్చింది. దొసి సేనలోని ముఖ్యలు అజింక్యా రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, రవిందంద్రన్ అశ్విన్ సహా కెప్టెన్ ధోనీలకు అరగుండు గీసనట్లుగా మార్పింగ్ చేసిన బంగ్లా మీడియా.. వారి చేతిలో ఒక బ్యానర్ ను పెట్టి.. దీనికి మేం అలవాటు పడ్డాం.. ఇది మాకు అలవాటు అన్న విధంగా వారి బాషలో రాసి పెట్టారు.

దీనికి పైన బంగ్లాదేశ్ యువ బౌలర్ ముస్తాపిజుర్ రహామాన్ చేతిలో కట్టర్ పెట్టి.. చురుకైన కట్టర్లు బంగ్లా వద్ద వున్నాయని, ఇందులో అన్ని ఆప్ కట్టర్లే నని, ఇవి కావాలంటే ఢాకాలోని మిర్పూర్ స్టేడియం మార్కెట్ కు రావాలని ఆ దేశ ప్రధాన వార్తా పత్రిక ప్రోథోమ్ లో పెద్ద సైజు ఫైక్ కట్టర్ను పెట్టి ముద్రించింది. దీనిపై రెండు దేశాల మధ్య సామాజిక మాద్యమం ద్వారా ఒక రకమైన యుద్దమే జరుగుతోంది. అయితే ప్రచూర్యం గల మీడియా ఇలాంటి చౌకబారు ప్రకటనలు ఇచ్చే ముందు.. ఒకసారి నైతిక విలువల గురించి కూడా ఆలోచించాలి. మేకపోతు గాంభీర్యంతో ఒకసారి విజయం బంగ్లాను వరించడంలో తప్పు లేదు. అయితే అదే రిపీట్ అవ్వుద్ది అన్న అహంకార దోరణి, కండకావరం ఆటలలో పనికి రావు. ఇవి క్రీడాస్ఫూర్తికి పూర్తి వ్యతిరేకమన్న విషయాన్ని మీడియా తెలుసుకోవాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  India  India vs Bangladesh  distasteful ad  

Other Articles