New ODI rules: Relief for bowlers as ICC decides to scrap batting powerplay and much more

Icc changes odi powerplay fielding free hit rules to help bowlers

Cricket, David Richardson, N Srinivasan, ODI rules, Anil Kumble, Battng Powerplay, Cricket, Dave Richardson, Free Hit, ICC, No ball, ODI rules, powerplay, fielding, free hit, bowlers, Sports, ICC Cricket World Cup 2015, world cup india stills, icc updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc, international cricket council, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, CWC 2015, Live Scores, Live Updates, Sports, World Cup

The ICC scrapped batting powerplays and relaxed field restrictions in the one-day international format in order to give a chance to bowlers in a format where batsmen have reigned supreme in recent times, most notably at the World Cup earlier this year.

వన్డేలు ఇక బౌలర్ ఫ్రెండ్లీ.. నిబంధనల్లో ఐసిసి కీలక సవరణలు

Posted: 06/27/2015 07:19 PM IST
Icc changes odi powerplay fielding free hit rules to help bowlers

గత కొన్నేళ్లుగా మనం చూసిన వన్డే క్రికెట్ ఫార్మెట్ లోని ఆటతీరుకు ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఫార్మెట్ లో మరింత అందాన్ని అలంకరించేందుక బార్బోడాస్ వేదికగా సమీక్షించిన క్రికెట్ పెద్దలు సన్నధమయ్యారు. వన్డే క్రికెట్ బౌలర్లకు తలనొప్పిగా మారిన బ్యాటింగ్ పవర్ ప్లే నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి పది ఓవర్ల పవర్ ప్లేను సిసి తొలగిస్తూ తాజాగా ఐసిసి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఇప్పటివరకు చివర్లో మరో పవర్ ప్లే తీసుకునే వెసులుబాటు బ్యాట్స్‌మెన్‌కు ఉండేది. కాగా, బార్బోడాస్‌ వేదికగా శనివారం జరిగిన ఐసీసీ వార్షిక స్థాయి సమావేశంలో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీయీవో డేవ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు.

అలాగే ఇంతకుముందు చివరి పది ఓవర్లలో నలుగురు ఫీల్డర్లకు మాత్రమే 30 అడుగుట సర్కిల్ లో అనుమతించే వారు. కాగా ఇప్పుడు ఆ నిబంధనను కూడా సవరించిన ఐసిసి మళ్లీ ఐదుగురు ఫీల్డర్లకు అనుమతినిస్తూ.. నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు బౌలర్ వేసిన నో బాల్ కు తదుపరి బంతి ఫ్రీ హిట్ గా వున్న నిబంధనను కూడా ఐసీసీ మార్చివేసింది. నో బాల్ కు వున్న ఫ్రీ హిట్ నిబంధనను పూర్తిగా తొలగిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు జూలై 5 నుంచి అమల్లోకి రానున్నట్లు డేవిడ్ రిచర్డ్ సన్ తెలిపాడు. దీనికి సంబంధించి గత నెలలో అనిల్ కుంబ్లే అధ్యక్షతన ముంబైలో జరిగిన ఐసిసి క్రీకెట్ కమిటీ సమావేశంలోని పలు సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఐసీసీ కీలక సవరణలు చేసింది. మొత్తానికి ఐసీసీ సవరణలతో ఇప్పటివరకు బ్యాట్స్ మెన్ ఫ్రెండ్లీ గా వుంటే వన్డేలు.. ఇకపై బౌలర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC  Cricket  David Richardson  N Srinivasan  ODI rules  

Other Articles