morgan leads england to stunning win over new zealand

Eoin morgan joe root tons help england chase record target

eng vs nz, nz vs eng, eng vs nz score, eng vs nz odi, england vs new zealand, new zealand vs england, england cricket team, new zealand cricket team, england new zealand, new zealand england, cricket new, cricket

Morgan (113), Root (106*) after Hales opening blitz help England chase record target with 6 overs to spare

భారీ టార్గెట్ ను చేధించి.. ఇంగ్లాండ్ రికార్డు

Posted: 06/18/2015 06:55 PM IST
Eoin morgan joe root tons help england chase record target

రికార్డు ఛేజింగ్ తో ఇంగ్లీషు సేన జయకేతనం ఎగురవేసింది. కివీస్ తో నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన పోరులో పైచేయి సాధించి సిరీస్ సమం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 ఓవర్లు మిగిలివుండానే ఛేదించింది. ఇంగ్లండ్ 44 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది.కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన ఇన్నింగ్స్ కు రూట్ సెంచరీ తోడవడంతో ఇంగ్లీషు టీమ్ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది.

మోర్గాన్ 82 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 113 పరుగులు బాదాడు. రూట్ 97 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు సాధించాడు. హేల్స్(67) అర్ధసెంచరీ చేశాడు. రాయ్ 38, స్టోక్స్ 19 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. విలియమ్సన్(90), ఇలియట్(55), గప్టిల్(53) రాణించారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. మోర్గాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eoin Morgan  Edward Root  England  Record chase  

Other Articles