Shastri to continue as director for Bangladesh tour

Ravi shastri named team indias interim coach bangladesh tour

Shastri to continue as director for Bangladesh tour, ravi shastri, team india, coach, bcci, cricket, sports, bangladesh, India's team director, indo-bangla cricket series, bangladesh tour, Ravi Shastri, Sanjay Bangar, Bharat Arun, R Sridhar, assistant coaches, BCCI, jagmohan dalmiya, Anurag thakur

Ravi Shastri has been named India's team director for the upcoming tour to Bangladesh, while Sanjay Bangar, Bharat Arun and R Sridhar will continue as assistant coaches for the tour.

భారత్ బంగ్లా పర్యటనకు తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి

Posted: 06/02/2015 03:17 PM IST
Ravi shastri named team indias interim coach bangladesh tour

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ప్రస్తుత డైరెక్టర్ రవిశాస్త్రి తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 న బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టకు బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్‌, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా రామకృష్ణ శ్రీధర్‌‌లను నియమిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన అనంతరం పూర్తి స్ధాయి కోచ్‌ నియామకం ఉంటుందని తెలిపారు. బంగ్లా పర్యటనలో భాగంగా జూన్ 10 నుంచి 24 వరకు టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలను ఆడుతుందని అన్నారు.

టస్టు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని, వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తారని బీసీసీఐ పేర్కొంది. రవిశాస్త్రి టీమిండియా తరుపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్ లాడిన అనుభవం ఉంది. అంతేకాదు, 1983 వరల్డ్ కప్‌ని సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆస్టేలియాలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2015 పర్యటనలో టీమిండియా డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆస్టేలియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ ఢంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగియడంతో బిసిసిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Shastri  Sanjay Bangar  Bharat Arun  R Sridhar  

Other Articles