Sachin, Sourav, Laxman in BCCI cricket advisory committee

Trio cricket legends in bcci cricket advisory committee

indian cricket team, sachin tendulkar, vvs laxman, sourav ganguly, bcci, bcci india, india bcci, bcci advisory committee, cricket news, cricket

Sachin Tendulkar, Sourav Ganguly and VVS Laxman to be part of BCCI cricket advisory committee.

బిసిసిఐ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు దిగ్గజాలు

Posted: 06/02/2015 02:10 PM IST
Trio cricket legends in bcci cricket advisory committee

వాళ్లంతా క్రికెట్ రారాజులు.. వాళ్ల అనుభవాలు ప్రస్తుత క్రికెటర్లకు పాఠాలు. ఫ్యూచర్ లో టీమిండియాను ఓ సరికొత్త జట్టుగా నిలపాలంటే ఇటువంటి గ్రేట్ క్రికెటర్ల అనుభవాలు, సలహాలు ఎంతో అవసరం. అందుకే సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో చోటు కల్పస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తమ అత్యుత్తమ ఆటతో సుదీర్ఘ కాలం టీమ్ ఇండియాను ముందుకు నడిపించిన దిగ్గజాలను ఒకటిగా చేర్చి నవతరానికి మార్గనిర్ధేకత్వం చేయాల్సిందిగా వారిని కోరింది భారత క్రికెట్ భవిష్యత్తును వీరి చేత్తులో పెడుతూ ఈ ముగ్గరికీ బిసిసిఐ అడ్వజరీ కమిటీలో స్థానం కల్పించింది.

సోమవారం ఈ ముగ్గురితో వేర్వేరుగా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మాట్లడిన అనంతరం బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు ప్రకటన చేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్ జగన్మోహన్ దాల్మియా క్రికెట్ లెజండ్స్ ను అడ్వజరీ కమిటీ మెంబర్స్ గా నియమించారని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకుర్ చెప్పారు. ఈ ముగ్గరి నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి టీమ్ ఇ:డియాకు ప్రధాన కచ్, టీమ్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. మున్ముందు భారత క్రికెట్ కు సంబంధించి అనేక వ్యవహరాల్లో వీరి పాత్ర కీలకం కానుందన్నారు.

భారత జట్టు బంగ్లాదేశ్ టూర్‌కు బయలుదేరక ముందే ముగ్గరు దిగ్గజాలతో కూడిన బిసిసిఐ సలహా మండలి సమామేశమవుతుందని సమాచారం. ఈనెల 4 లేదా 5వ తేదీన బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా హాజరయ్యే ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ పాల్గొంటారని తెలుస్తున్నది. బంగ్లాదేశ్ టూర్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చిస్తారు. పసికూన బంగ్లాదేశ్ బాగా రాటు తేలి ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ ను, పాకిస్థాన్ సీరీస్ లో పాక్ ను కూడా మూడు చెరువుల నీళ్ల తాగించే స్థాయికి వెళ్లిన నేపథ్యంలో భారత్‌ను అన్ని విధాలా సిద్ధం చేయడానికి సచిన్ బృందం కృషి చేయనుంది. అందుకు అవసరమైన సూచనలు చేస్తుంది. అయితే బిసిసిఐ కోచ్ సహా డైరెక్టర్ పదవులకు సచిన్, గంగూలీలిద్దరూ పోటీ పడుతున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కూడా పలువురు క్రీడాభిమానులు చెవులు కోరుక్కుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Sourav Ganguly  VVS Laxman  BCCI cricket advisory committee  

Other Articles