BCCI announces Team India squad for Bangladesh tour

Showed arjun tendulkar how to bring ball back into right handers wasim akram

kolkata knight riders, Mumbai Indians, New Delhi, Pakistan, sachin tendulkar, Showed Arjun Tendulkar, Tendulkar Sr, Wasim Akram, sultan of swing wasim akram, arjun tendulkar, cricket, sachin tendulkar, ball, ipl 8, ipl, cricket, mumbai, wankhede stadium, brian lara

Former Pakistan legend Wasim Akram has termed Sachin Tendulkar's teenager son Arjun as a 'passionate kid' who wanted to learn the nuances of left-arm swing bowling during their interaction in Mumbai recently.

చిట్కాతో రాణిస్తున్న అర్జున్.. అక్రమ్ ఫిదా..!

Posted: 05/20/2015 04:58 PM IST
Showed arjun tendulkar how to bring ball back into right handers wasim akram

ఎవరైనా గురవులు చెప్పిన పాఠాలను, పరీక్షల కాలంలో చెబుతున్న చిట్కాలను సక్రమంగా ఉపయోగిస్తే.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే ఇక్కడ కూడా ఈ జూనియర్ టెండుల్కర్ సరిగ్గా అలానే చేస్తున్నాడు. అంతేకాదు గురువును మించిన శిష్యుడిగా రాణిస్తూ.. ప్రతిభను కనబర్చడంతో.. ఏకంగా గురువర్యులే ఆశ్చర్యం వ్యక్తం చే్స్తున్నాడు. ఇంతకీ గురు శిష్యులు ఎవరనేగా మీ సందేహం. వారెవరో కాదండీ.. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పుత్రరత్నం అర్జున్ టెండుల్కర్ శిష్యుడైతే.. గురువుగారు స్వింగ్ సామ్రాట్ గా పేరోందిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్.

ఇటీవల ముంబైలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు వసీమ్ అక్రమ్ బౌలింగ్ కిటుకులు నేర్పారు. వాంఖేడే స్టేడియంలో సచిన్ తన తనయుడిని నెట్స్ వద్ద ఉన్న వసీం వద్దకు తీసుకువచ్చాడు. అర్జున్ టెండుల్కర్‌కు వసీం అక్రమ్ ఫిట్‌నెస్, బంతి గ్రిప్ పైన పలు సలహాలు ఇచ్చాడు. అంతేకాకుండా కుడి చేతి వాటం గల బ్యాట్స్ మెన్ లకు బంతిని ఎలా విసరాలి, వారికి పరుగులు ఇవ్వకుండా ఎలా కట్టడి చేయాలన్న మెలకువలను నేర్పించాడు.

ఆ తరువాత కొన్ని రోజులకు శిష్యుడు అర్జున్ టెండుల్కర్ ప్రదర్శన పట్ల గురువర్యులు వసీమ్ అక్రమ్ ముగ్ధుడయ్యాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ... అర్జున్ టెండుల్కర్‌లో క్రికెట్ తపన చాలా ఉందన్నాడు. లెఫ్టార్మ పేసర్ అయిన అర్జున్‌లో చాలా టాలెంట్ ఉందని చెప్పాడు. మణికట్టును ఉపయోగించడంపై అతడికి పలు సలహాలు ఇచ్చానని తెలిపాడు. ముఖ్యంగా కుడిచేతివాటం ఆటగాడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని లోపలకు స్వింగ్ చేయడం ఎలాగో చెప్పానని తెలిపాడు. ఈ టెక్నిక్‌కు మూడు నెలల పాటు ప్రాక్టీస్ చేయమని చెప్పానని, దానిని సాధన చేశాక, కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు అవుట్ స్వింగ్ రాబట్టడం నేర్పిస్తానని చెప్పాడు. ఈ కిటుకులన్నీ రాబట్టిన తరువాత భారత్ కు మరో గొప్ప బౌలర్ లభించనున్నాడని భారత క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానించుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  arjun tendulkar  wasim akram  

Other Articles