Former Cricketer Sreesanth wants to comeback in team | indian IPL Spot Fixing Case

Sreesanth wants to comeback in team indian ipl spot fixing case

Sreesanth news, Sreesanth daughter, Sreesanth photos, Sreesanth marriage, Sreesanth interview, Sreesanth team india, Sreesanth controversy, Sreesanth wife, Sreesanth bhuvaneswari

Sreesanth wants to comeback in team indian IPL Spot Fixing Case : Former Cricketer Sreesanth wants to comeback in team.

ఈ మాజీ క్రికెటర్ కోరిక తీరుతుందా?

Posted: 05/16/2015 12:36 PM IST
Sreesanth wants to comeback in team indian ipl spot fixing case

ఐపీఎల్-6 సీజన్ లో భాగంగా జరిగిన స్పాట్ ఫిక్సింగ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఈ వివాదంలో కొందరు యువ క్రికెటర్లతోపాటు శ్రీశాంత్ హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం అతడు అరెస్ట్ కావడం, కొన్నాళ్లు జైల్లో గడపడం, తర్వాత విడుదల కావడం జరిగిపోయాయి. ఏదేతేనేం.. శ్రీశాంత్ తన క్రికెట్ కెరీర్ ను చేతులారా నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతగాడు జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. అయితే.. తనకు మళ్లీ టీమిండియాకు ఆడాలని వుందని తాజాగా తన కోరికను ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు.

గతేడాది భువనేవ్వరి కుమారిని వివాహం చేసుకున్న శ్రీశాంత్ దంపతులకు ఇటీవలే కూతురు పుట్టిన విషయం విదితమే! కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ నిరాశగా కొనసాగిస్తున్న తరుణంలో కూతురు పుట్టడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. తండ్రిగా శ్రీశాంత్ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కూతురు రాకతో మా జీవితంలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయన్న ఆశ నాలో కలుగుతోంది. మళ్లీ టీమిండియాకు ఆడాలనేది నా కోరిక’ అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.

ఇదిలావుండగా.. తన కూతురికి ఇంకా పేరు ఖరారు చేయలేదని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వచ్చే రెండు నెలల్లో పాపకు పేరు పెట్టే శుభకార్యం ఉండవచ్చని తెలిపాడు. అయితే.. చాలారోజుల టీమిండియాకు ఆడాలనుందన్న శ్రీశాంత్ కోరిక తీరుతుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreesanth  Team India  IPl sport fixing  

Other Articles