Cops Raid and question IPL cheerleaders in Raipur | IPL 8 Season | Spot Fixing

Police cops raid question ipl cheerleaders in raipur

ipl cheer leaders, ipl news, ipl updates, cheer leaders police raid, cops raid cheer leaders, ipl spot fixing, spot fixing matches, cheer leaders photos, cheer leaders controversy, cheer leaders affairs, cheer leaders news, ipl cricket members, raipur police

Police Cops Raid question IPL cheerleaders in Raipur : In a shocking incident of police high-handedness, IPL cheerleaders hired by the Chennai Super Kings franchise ahead of their match against Delhi Daredevils were harassed and humiliated by local cops on Tuesday.

‘ఛీర్ గాళ్స్’కి రాత్రి చుక్కలు చూపించిన పోలీసులు

Posted: 05/13/2015 11:32 AM IST
Police cops raid question ipl cheerleaders in raipur

క్రికెట్ మైదానంలో రెండుజట్ల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన పోరాటం సమయంలో ‘చీర్ లీడర్స్’ తమ స్టెప్పులతో హోరెత్తిస్తుంటారు. తమ అందాల ప్రదర్శనతో అక్కడున్న టెన్షన్ వాతావరణాన్ని సెక్సీగా మార్చేస్తారు. ఆ గ్రౌండ్ లో వున్న ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఐపీఎల్ లో ఈ ‘చీర్ గాళ్స్’ ఓ ప్రత్యేక ఆకర్షణ! ప్రేక్షకులను ఆనందపరిచేందుకు వీరంతా ఎన్నో తంటాలు పడుతుంటారు. మ్యాచ్ ముగిసేవరకు డ్యాన్సులు చేస్తూ అలసిసొలిసిపోయే ఈ భామలు సేద తీర్చుకోవడానికని రాత్రి తమ గదులకు వెళితే.. అక్కడ వీళ్లకు పోలీసులు చుక్కలు చూపించారని సమాచారం!

వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ అంటే ముందుగా స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలే గుర్తుకు వస్తుంటాయి. మొదటి సీజన్ నుంచే ఈ వివాదానికి సంబంధించిన వార్తలు వెలువడుతూనే వున్నాయి కానీ.. 6వ సీజన్ లో అది బట్టబయలైంది. ఆ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇక అక్కడి నుంచి ఐపీఎల్ కి ‘స్పాట్ ఫిక్సింగ్’ అనే ముద్ర పడిపోయింది. దాని ప్రభావం 8వ సీజన్ లోనూ పడింది. ఇప్పటివరకు ఐపీఎల్-8లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు ఏమీ జరగలేదు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలేవీ వెలుగులోకి రాకుండా ఈ సీజన్ సజావుగానే సాగుతోంది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో లోలోపలే  స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్లను చీర్ లీడర్స్ ద్వారా ఎరవేసి ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఛీర్ గాళ్స్ గదులపై పోలీసుల దాడి చేశారు.

ఐపీఎల్-8 సజావుగా సాగుతోందనుకున్న తరుణంలో పోలీసులు చీర్ గాళ్స్ గదులపై దాడి చేయడం సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి రాయ్పూర్లో ఢిల్లీ- చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన కొద్ది గంటలకే నగరంలోని జీఈ రోడ్డు ప్రాంతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఛీర్ లీడర్స్ బస చేసిన హోటల్ పై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. మూడు వాహనాల్లో హోటల్ కు చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు ఛీర్ లీడర్స్ పై రకరకాల ప్రశ్నలు సంధించారు. హోటల్లోని ఇతర గదులకూ వెళ్లిన పోలీసులు.. సంబంధిత వ్యక్తుల వివరాలు సేకరించారు. కొందరు బుకీలు ఛీర్ లీడర్స్ ద్వారా ఆటగాళ్లకు ఎరవేసి ఫిక్సింగ్ కు పాల్పడిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఛీర్ లీడర్స్కు, ఆటగాళ్లకు ఐపీఎల్ నిర్వాహకులు వేర్వేరు హోటల్స్లో బస ఏర్పాటు చేశారు.

ఇదిలావుండగా.. సోదాల పేరుతో పోలీసులు తమను వేధించారని చెన్నై జట్టు ఛీర్ లీడర్స్ బోరున విలపించారు. తమకు వర్క్ పర్మిట్ ఉందని, గతంలో బాలీవుడ్ సినిమాలకు కూడా పని చేశామని అయితే ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదని, అడ్డమైన ప్రశ్నలడిగి పోలీసులు తమను ఇబ్బందిపెట్టారని ఓ ఛీర్ గళ్ కన్నీటి పర్యంతమైంది. తమపై ఏవైనా ఫిర్యాదులు వస్తే నిర్వాహకులను సంప్రదించాలికానీ ఇలా హోటల్ గదుల్లోకి దూరి భీభత్సం చేయడమేంటని ఛీర్ గాళ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. రొటీన్ చెకప్స్లో భాగంగానే ఛీర్ లీడర్స్ గదుల్ని తనిఖీ చేశామని, ఇందులో మరో ఉద్దేశానికి తావు లేదని రాయ్ పూర్ సిటీ ఎస్పీ అన్షుమన్ సింగ్ సిసోడియా వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheer Leaders  Ipl Spot Fixing  Ipl 8 season controversy  

Other Articles