Ajinkya Rahane Feels very bad the lost against Mumbai Indians Match

Ajinkya rahane latest interview bad shot mumbai indians innings

Ajinkya Rahane News, Ajinkya Rahane updates, Ajinkya Rahane gallery, Ajinkya Rahane images, Ajinkya Rahane controversy, Ajinkya Rahane ipl 8 season, Ajinkya Rahane matches, Ajinkya Rahane innings

Ajinkya Rahane Latest Interview Bad Shot Mumbai Indians Innings : I couldn't sleep after my shot against Mumbai Indians, says Rahane

రహానేకు రాత్రంతా నిద్రలేకుండా చేసిన ‘షాట్’

Posted: 05/04/2015 03:29 PM IST
Ajinkya rahane latest interview bad shot mumbai indians innings

ఐసీసీ వరల్డ్ కప్-2015లో అత్యంత దారుణమైన పెర్ఫార్మెన్స్ ను కనబరిచిన ఇండియన్ క్రికెటర్ అజింక్యా రహానే.. ఐపీఎల్-8లో రాజస్థాన్ జట్టు తరఫున అద్భుతమైన ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిలో ముందంజలో వున్నాడు కూడా! రాయల్స్ జట్టు ఆపదలో వున్నప్పుడు చివరివరకు అజేయంగా నిలబడి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇంతలా రాణిస్తున్న ఈ ఆటగాడిని మాత్రం ఓ ‘షాట్’ తనకు రాత్రంతా నిద్రపట్టనివ్వలేదట! ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 1వ తేదీన జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ సందర్భంగానే రహానే కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వినయ్ కుమార్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అలా తాను ఔట్ అయిన ఆ వ్యవహారం గురించే తాజాగా రహానే గుర్తు చేసుకున్నాడు. ఆరోజు తాను చాలా చెత్త షాట్ ఆడాడని.. అలా ఆడినందుకు తాను చాలా బాధపడినట్లుగా అతగాడు వెల్లడించాడు. అంతేకాదు.. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా గడిపినట్లుగా అతను తెలిపాడు. తాను ఆ చెత్త షాట్ ఆడకపోయి వుంటే.. జట్టు ఓటమిపాలు కాకుండా గెలుపుదిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడినన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఈ విషయంపై రహానే మాట్లాడుతూ.. ‘ముంబైతో ఆడిన మ్యాచ్ లో నేను చెత్త షాట్ ఆడినందుకు చాలా బాధపడ్డాను. ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపా. ఆ షాట్ గురించి, జట్టు పరాజయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను’ అని చెప్పాడు. అయితే.. తర్వాతి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్లో రహానె 400 పైచిలుకు పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajinkya Rahane  IPL 8 Season  Mumbai Indians  

Other Articles